కర్ణాటకలోని బాగలూరులో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువకుడి తల నరికి దారుణంగా హత్య చేశారు. తలను స్థానికంగా ఉన్న మారియమ్మ ఆలయం వద్ద ఉంచి, మొండెంను సమీపంలోని చెట్ల పొదల్లో పడేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. కర్ణాటక రాష్ట్రంలోని హోసూరు తాలూకా బాగలూరు సమీపంలోని ఎలువపల్లి గ్రామానికి చెందిన వెంకటేశప్ప కుమారుడు ప్రదీప్. ఇతనికి చంద్రిక అనే యువతితో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు సంతానం. మరో సారి గర్భం దాల్చడంతో ప్రసవం కోసం చంద్రిక పుట్టింటికెళ్లింది.
ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ప్రదీప్ తల నరికి అదే ప్రాంతంలోని మారియమ్మ ఆలయం ముందు పడేసి వెళ్లారు. సమాచారం అందుకున్న బాగలూరు పోలీసులు సమీప ప్రాంతాల్లో మొండెం కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. కొంచెం దూరంలో తల లేని మృతదేహం కనిపించింది. ఎస్పీ అదే ప్రాంతానికి చెందిన బంధువులు సంతోష్, మురళితో ప్రదీప్‌కు గత 15 ఏళ్లుగా ఆస్తి తగాదాలున్నాయని, వారే హత్య చేసి ఉంటారని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కేసును కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ముమ్మరం చేశారు.
Also Read
AP News: అమలాపురంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్లమేర నిలిచిపోయిన వాహనాలు.. ఎందుకంటే..?
Lakhimpur Kheri violence: యూపీలో కీలక పరిణామం.. లఖీంపూర్ ఖేరి ఘటనలో కేంద్రమంత్రి కుమారుడికి బెయిల్