Sister Husband: సమాజంలో జరుగుతోన్న కొన్ని ఘటనలు కొన్నిసార్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటే ఇంకొన్ని సార్లు సమాజం ఎటువైపు ప్రయాణిస్తుందన్న వాదనను తెరపైకి తీసుకొస్తున్నాయి. తాజాగా కర్ణాటకలో జరిగిన ఓ సంఘటన ఇలాంటి ప్రశ్నలనే సంధిస్తోంది. ఓ యువతి తన అక్క భర్తతోనే పారిపోయిన సంఘటన స్థానికులను ముక్కుపై వేలు వేసుకునేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని కన్యాడికి చెందిన మహమ్మద్ అనే వ్యక్తికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఎనిమిది నెలల క్రితమే పెద్దమ్మాయి సౌధాను ముస్తాఫా అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇక తరుచూ అత్తారింటికి వచ్చే క్రమంలో.. ముస్తాఫా చిన్న కూతురు రైహానాతో మాటలు కలిశాయి. వీరిద్దరూ ఫోన్‌లో మాట్లాడుకోవడం కూడా ప్రారంభించారు. వీరి బంధం మరింత బలపడి ఏకంగా ఇద్దరు కలిసి పారపోయే స్టేజ్‌కు చేరుకుంది. జులై 8న రైహానా వరుసకు బావ అయ్యే ముస్తాఫాతో ఇంటి నుంచి పారిపోయింది.
ఈ విషయమై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు తండ్రి మహమ్మద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన పెద్ద కూతురు సౌధాకు అల్లుడితో ఇటీవల మనస్పార్థాలు రావడంతో ఆమె తమతోనే ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే జులై 8న ముస్తాఫా కారులో తమ ఇంటికి వచ్చాడని, ఆ సమయంలోనే తన చిన్న కూతురు రైహానా.. చేతిలో బ్యాగు పట్టుకొని అదే కారులో అల్లుడితో వెళ్లిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ ప్రారంభించారు.
Kamal Haasan: విడుదలైన విక్రమ్ మూవీ ఫస్ట్ పోస్టర్ .. న్యూ లుక్ లో ఆకట్టుకున్న కమల్
Home Remedies: మూర్ఛ వ్యాధి నివారణకు, నిద్రలేమి నుంచి బయటపడానికి ఈ సింపుల్ చిట్కాలు పాటించండి