Road Accident in West Godavari District: తీర్థయాత్రకు వెళ్లి తిరిగి రాని లోకాలకు పయనమయ్యారు. పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ఎస్‌ఐ భార్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, కుటుంబసభ్యులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ యాక్సిడెంట్‌లో సూర్యారావుపేట సీసీఎస్ ఎస్పై సత్యనారాయణ కుటుంబంతో కలిసి అన్నవరం వెళుతుండగా తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. అదుపుతప్పి కారు పంట పొలాలకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఎస్‌ఐ సత్యనారాయణ భార్య సరోజ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందింది. గాయపడ్డ మిగిలిన కుటుంబసభ్యులను రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు స్పాట్ చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
Read Also…. Lungs Protect Tips: పొంచి ఉన్న వాయు కాలుష్యం ముప్పు.. మీ ఊపిరితిత్తులను ఇలా కాపాడుకోండి..