మరో దిశ ఘటన..రంగారెడ్డి జిల్లాలో దారుణం

|

Mar 17, 2020 | 11:25 AM

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది దిశ సంఘటన. తాజాగా రంగారెడ్డి జిల్లాలో అటువంటిదే మరో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని చేవెళ్ల మండలం తంగడపల్లి గ్రామశివారులో ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన దుండగులు ఆమెను..

మరో దిశ ఘటన..రంగారెడ్డి జిల్లాలో దారుణం
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది దిశ సంఘటన. తాజాగా రంగారెడ్డి జిల్లాలో అటువంటిదే మరో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని చేవెళ్ల మండలం తంగడపల్లి గ్రామశివారులో ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన దుండగులు ఆమెను హత్యచేశారు. మహిళ ముఖంపై బండరాళ్లతో దాడిచేసి హత్య చేశారు. హైదరాబాద్‌-వికారాబాద్‌ వయా చిలుకూరు దేవాలయం ప్రధాన రహదారిపై ఈ దారుణ ఘటన జరిగింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మహిళ శరీరంపై దుస్తులు లేకపోవడం, బండరాయితో తలపై మోదీ హత్యచేసినట్లు ఆనవాళ్లు ఉండటంతో అత్యాచారం చేసి హత్యచేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సంఘటనకు సంబంధించి ఆధారాల కోసం పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. మహిళకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Read this story also: తల్లీ, కొడుకు సజీవదహనం !

Read this story also :కరోనా ఎఫెక్ట్: ఉజ్జయిని మహాకాళి ఆలయం మూసివేత