Crime News Gujarath : బావను వాహనానికి కట్టేసి అరకిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లిన బావమరిది.. ఎందుకు ఇలా చేశాడంటే..

Crime News Gujarath : గుజరాత్‌లోని సూరత్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. తన సోదరిని నిత్యం వేధిస్తున్నాడని తెలిసి సొంత బావనే వాహనానికి

Crime News Gujarath : బావను వాహనానికి కట్టేసి అరకిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లిన బావమరిది.. ఎందుకు ఇలా చేశాడంటే..

Updated on: Mar 01, 2021 | 5:34 AM

Crime News Gujarath : గుజరాత్‌లోని సూరత్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. తన సోదరిని నిత్యం వేధిస్తున్నాడని తెలిసి సొంత బావనే వాహనానికి కట్టేసి అర కిలోమీటరు ఈడ్చుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

బాల్‌కృష్ణ రాథోడ్ అనే వ్యక్తి కడోదరాలోని దుర్గానగర్ ప్రాంతంలో తన భార్య శీతల్ రాథోడ్‌తో కలిసి నివసిస్తున్నాడు. శుక్రవారం మద్యం తాగి ఇంటికి వచ్చిన బాల్‌కృష్ణ భార్యతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో ఆమెను తీవ్రంగా కొట్టాడు. దీంతో శీతల్ తన సోదరుడు అనిల్ చౌహాన్‌కు ఫోన్ చేసి ఇంటికి రావాల్సిందిగా కోరింది. ఇక, టెంపో నడుపుతూ జీవనం సాగిందచే అనిల్.. సోదరి ఫోన్ చేయడంతో ఆమె ఇంటికి చేరుకున్నాడు. తన సోదరిని కొట్టవద్దని బావను కోరాడు.

అయినప్పటికీ బాల్‌కృష్ణ వినిపించుకోలేదు. బార్యతో పాటు బామర్ధిని కూడా తిట్టడం ప్రారంభించాడు. అలాగే ఇంట్లోని వస్తువులను పడవేయడం చేయసాగాడు. అనిల్ అతన్ని ఎంత కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. దీంతో బాల్‌కృష్ణకు ఎలాగైనా గుణపాఠం చెప్పాలని అతని భార్య, బామర్ధి నిర్ణయించుకున్నారు. తొలుత వారిద్దరు కలిసి బాల్‌కృష్ణపై దాడి చేశారు. ఆ తర్వాత అతని ఒక చేతిని టెంపో వాహనానికి తాడుతో కట్టారు. అనంతరం వాహనాన్ని వేగంగా పోనిస్తూ.. బాల్‌కృష్ణను లాక్కెళ్లారు. దాదాపు అరకిలోమీటర్ వరకు ఇలానే వెళ్లారు.

అయితే ఇది గమనించిన పలువురు స్థానికులు వాహనాన్ని అడ్డుకున్నారు. అనిల్ చౌహన్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాల్‌కృష్ణను కడోదరాలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉండటంతో నగరంలోని SMIMER హాస్పిటల్‌కు షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం బాధితుడు ఇంకా అపస్మారక స్థితిలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. తలకు బలమైన గాయాలు కావడంతో అతని పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు.