Andhra Pradesh: భర్త మృతిని తట్టుకోలేక భార్య ఆత్మహత్య.. చింతూరు మండలంలో విషాదం..!

Andhra Pradesh: ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చింతూరు మండలం గోపాలపురంలో భర్త మృతిని తట్టుకోలేక భార్య బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు..

Andhra Pradesh: భర్త మృతిని తట్టుకోలేక భార్య ఆత్మహత్య.. చింతూరు మండలంలో విషాదం..!

Updated on: Apr 30, 2022 | 11:42 AM

Andhra Pradesh: ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చింతూరు మండలం గోపాలపురంలో భర్త మృతిని తట్టుకోలేక భార్య బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జోగయ్య, సరోజిని కొన్నేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో భర్త జోగయ్య రెండు నెలల క్రితం మరణించాడు. అయితే.. అతని మరణం తట్టుకోలేక భార్య ఆత్మహత్యకు పాల్పడింది. భర్త పోడియం జోగయ్య మరణించిన నాటి నుంచి భార్య సరోజిని అతని జ్ఞాపకాలతోనే జీవిస్తోంది. ఈ దంపతులకు ఒక బాబు ఉన్నాడు. జోగయ్య మరణాన్ని తట్టులేకపోయిన భార్య సరోజిని పిట్టల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కాగా.. రెండు నెలల కిందట జోగయ్య, ఇప్పుడు సరోజిని మృతి చెందడంతో పసిబిడ్డ అనాథగా మారాడు. భార్యాభర్తలిద్దరూ రెండు నెలల్లోనే మరణించడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మోతుగూడెం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా.. సరోజిని మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Crime News: ట్యాక్సీడ్రైవర్ దాష్టీకం.. తల్లితో సహజీవనం చేస్తూనే కుమార్తెపై అత్యాచారం..

Crime News: దుర్మార్గుడి దారుణం.. కట్నం తీసుకురాలేదని భార్యపైనే అత్యాచారం చేయించాడు.. ఆ తర్వాత