
వెస్ట్ బెంగాల్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించిన బీజేపీ ఎమ్మెల్యే కేసులో ఒకరిని అరెస్ట్ చేశారు పోలీఉసలు. బుధవారం నాడు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) బీజేపీ ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్ రాయ్ మృతి కేసుకు సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్ రాయ్ జేబులో ఓ సూసైడ్ నోట్‌ను గుర్తించామని.. దాని అందులో నీలోయ్ సింగ్ అని పేరు ఉందని తెలిపారు. సూసైడ్ నోట్ ఆధారంగా సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే బుధవారం నాడే ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు.. సూసైడ్ నోట్ ఆధారంగా విచారణ చేపడుతూ.. నిందితుడు నీలోయ్ సింగ్‌ను అరెస్ట్ చేశారు.