Baby Sold For Car: ప్ర‌శ్నార్థ‌కంగా మారుతోన్న మాన‌వ‌త్వం… కారు కొన‌డానికి క‌న్న బిడ్డ‌ను అమ్ముకున్న జంట‌..

Baby Sold For Car: స‌మాజంలో జరుగుతోన్న కొన్ని సంఘ‌ట‌ల‌ను చూస్తుంటే మాన‌వ‌త్వం ప్ర‌శ్నార్థ‌కంగా మారిపోతోంది. డ‌బ్బు సంపాద‌న కోసం కొంద‌రు మ‌రీ దిగ‌జారిపోతున్నారు. జీవితంలో డ‌బ్బే ముఖ్య‌మ‌ని...

Baby Sold For Car: ప్ర‌శ్నార్థ‌కంగా మారుతోన్న మాన‌వ‌త్వం... కారు కొన‌డానికి క‌న్న బిడ్డ‌ను అమ్ముకున్న జంట‌..
Parents Sold Kids

Updated on: May 14, 2021 | 2:57 PM

Baby Sold For Car: స‌మాజంలో జరుగుతోన్న కొన్ని సంఘ‌ట‌ల‌ను చూస్తుంటే మాన‌వ‌త్వం ప్ర‌శ్నార్థ‌కంగా మారిపోతోంది. డ‌బ్బు సంపాద‌న కోసం కొంద‌రు మ‌రీ దిగ‌జారిపోతున్నారు. జీవితంలో డ‌బ్బే ముఖ్య‌మ‌ని, విలాస జీవిత‌మే ప్ర‌ధాన‌మ‌ని భావించే కొంద‌రు చివ‌రికి మాన‌వ‌త్వాన్ని కూడా మ‌రిచిపోతున్నారు. డ‌బ్బే ల‌క్ష్యంగా జీవిస్తూ విలువ‌ల‌కు స్థానం లేకుండా చేస్తున్నారు. తాజాగా ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న మ‌నిషి మాన‌వ‌త్వాన్నే ప్ర‌శ్నిస్తోంది.

వివ‌రాల్లోకి వెళితే.. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని క‌న్నూజ్ జిల్లాకి చెందిన ఓ జంట సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేయాల‌నుకుంది. దీనికి అవ‌స‌ర‌మైన డ‌బ్బు కోసం ఏకంగా క‌న్న బిడ్డ‌నే అమ్ముకున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న ఆ చిన్నారి తాతయ్య‌, అమ్మ‌మ్మ‌లు తిర్వా కోట్‌వ‌లి పోలీస్ స్టేష‌న్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. క‌నీసం క‌నిక‌రం లేని ఆ త‌ల్లిదండ్రులు చిన్నారికి రూ. ల‌క్ష‌న్న‌రకు స్థానికంగా ఉన్న ఒక వ్యాపారికి అమ్మిన‌ట్లు వారు పోలీసుల‌కు తెలిపారు. త‌మ అల్లుడు, కూతురు మూడు నెల‌ల చిన్నారిని వ్యాపారికి రూ. ల‌క్ష‌న్న‌రకు అమ్మేశార‌ని.. కారును కొనుగోలు చేయ‌డం కోస‌మే వారు అలా చేశార‌ని చిన్నారి తాత, అమ్మ చెప్పుకొచ్చారు. ఇక విచార‌ణ మొద‌లు పెట్టిన పోలీసులు చిన్నారిని అమ్ముకున్న త‌ల్లిదండ్రుల‌ను పోలీస్ స్టేష‌న్‌కు పిలిపించి శుక్ర‌వారం విచార‌ణ చేప‌డుతున్నారు.

Also Read: Cyclone Names: అసలు తుఫానులకు పేర్లు ఎవరు పెడతారు…? ఎలా నిర్ణయిస్తారో మీకు తెలుసా..?

Viral Video : పోలీస్ దెబ్బలను తప్పించుకోవడానికి ఈ వ్యక్తి ఏం చేశాడో తెలిస్తే నవ్వొస్తుంది..!

కల్లు కంపౌండ్ మహిళలే అతడి టార్గెట్..! ఇప్పటి వరకు 19 మంది మహిళలపై అత్యాచారం, దోపిడీ..

Loading...
Unable to load recommendations.
Follow Us