నిద్రపోతున్న భార్య, ఇద్దరు కూతుర్లపై యాసిడ్‌ పోసిన దుర్మార్గుడు! కారణం ఏంటంటే..?

ఉత్తరప్రదేశ్ షాజహాన్ పూర్ లోని తిక్రి గ్రామంలో భర్త తన నిద్రిస్తున్న భార్య, ఇద్దరు కుమార్తెలపై యాసిడ్ దాడి చేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం అనుమానంతో రామ్ గోపాల్ అనే వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డాడు. గాయపడిన ముగ్గురు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

నిద్రపోతున్న భార్య, ఇద్దరు కూతుర్లపై యాసిడ్‌ పోసిన దుర్మార్గుడు! కారణం ఏంటంటే..?
Acid Attack

Updated on: Apr 20, 2025 | 3:04 PM

నిద్రిస్తున్న తన భార్య, ఇద్దరు కుమార్తెలపై యాసిడ్‌ పోసిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లోని తిక్రి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ దాడిలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు రామ్ గోపాల్ తన భార్య రామ్‌గుణికి వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు.

గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించి తన 39 ఏళ్ల భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు 23 ఏళ్ల రచిత, 16 ఏళ్ల నేహా నిద్రిస్తున్న సమయంలో దాడి చేశాడు. ముగ్గురికీ తీవ్ర కాలిన గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏఎస్పీ దేవేంద్ర కుమార్ మాట్లాడుతూ.. రామ్‌గుణి తన పిల్లలతో కలిసి తిక్రి గ్రామంలోని అద్దె ఇంట్లో నివసిస్తోంది. ఆమె భర్త హర్డోయ్‌లోని షహాబాద్‌లో ఉంటున్నాడు. రామ్ గోపాల్‌కు మద్యం సేవించే అలవాటున్నాడని, తన వ్యసనాన్ని కొనసాగించడానికి షహాబాద్‌లోని తన వ్యవసాయ భూమిని అమ్మేశాడని పోలీసులు తెలిపారు.

తరచూ గొడవలు, భార్యపై అనుమానంతో భార్యభర్తలు వేరేవేరుగా జీవిస్తున్నారు. రామ్‌గుణి పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది. ఈ క్రమంలోనే తన భార్య వేరే వ్యక్తితో వివాహేత సంబంధం పెట్టుకుందని రామ్‌ గోపాల్‌ ఈ దారుణానికి పాల్పడ్డాడు. దాడి తర్వాత అతను పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. అయితే దాడి జరిగిన సమయంలో రామ్‌గుణి, రామ్‌ గోపాల్‌ కుమారుడు అషు ఇంట్లో లేడు. దాడి చేసిన తన తండ్రిపై అతనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.