నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ పరిధిలో దారుణ ఘటన.. గొంతుకు తాడు బిగించి హత్య.. ఆపై ఏం చేశారో తెలుసా..

Nizamabad Murder: తెలంగాణలోని నిజమాబాద్ జిల్లా బాల్కొండ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొంతమంది దుండగులు గుర్తు తెలియని వ్యక్తిని

నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ పరిధిలో దారుణ ఘటన.. గొంతుకు తాడు బిగించి హత్య.. ఆపై ఏం చేశారో తెలుసా..

Updated on: Feb 01, 2021 | 5:57 AM

Nizamabad Murder: తెలంగాణలోని నిజమాబాద్ జిల్లా బాల్కొండ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొంతమంది దుండగులు గుర్తు తెలియని వ్యక్తిని అతి దారుణంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముప్కాల్‌ మండలం వేంపల్లి శివారులో 44 వ జాతీయ రహదారి పక్కన ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వ్యక్తి వయస్సు 40 సంవత్సరాలు ఉండొచ్చని భావిస్తున్నారు. గొంతుకు తాడు బిగించడంతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు చెబుతున్నారు. దుండగులు మృతదేహాన్ని జాతీయ రహదారి పక్కన పడేసి తల భాగంలో పెట్రోల్‌ పోసి తగులబెట్టిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పోలసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాల కోసం వెతుకుతున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం బాల్కొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యా్ప్తు చేస్తున్నారు.

Son in Law Murder: పిల్లనిచ్చిన మామ చేతిలో అల్లుడు దారుణ హత్య.. కారణాలు ఇలా ఉన్నాయి..

Follow Us