KFC Chicken: అక్కడ చికెన్‌ లొట్టలేసుకుంటూ తింటున్నారా..? మీకు ఇలాంటి ఉడికిఉడకని పీస్‌లు కూడా రావొచ్చు..

Hyderabad KFC store: ప్రపంచవ్యాప్తంగా కేఎఫ్‌సీ చికెన్‌ అంటే తెలియని వారుండరు. కేఎఫ్‌సీ చికెన్‌ అంటే చాలు.. లొట్టలేసుకుంటూ తినేవారు చాలామంది

KFC Chicken: అక్కడ చికెన్‌ లొట్టలేసుకుంటూ తింటున్నారా..? మీకు ఇలాంటి ఉడికిఉడకని పీస్‌లు కూడా రావొచ్చు..
Kfc

Edited By:

Updated on: Aug 09, 2021 | 6:34 PM

Hyderabad KFC store: ప్రపంచవ్యాప్తంగా కేఎఫ్‌సీ చికెన్‌ అంటే తెలియని వారుండరు. కేఎఫ్‌సీ చికెన్‌ అంటే చాలు.. లొట్టలేసుకుంటూ తినేవారు చాలామంది ఉంటారు. అయితే.. కేఎఫ్‌సీ చికెన్‌ కొంచెం టేస్ట్‌ మారినా.. లేదా కొంచెం ఉడకపోయినా.. కంపెనీ వెంటనే క్షమాపణలు చెప్పి.. మరికొన్ని పీస్‌లను కస్టమర్లకు ఇస్తుంటుంది. అందుకే కేఎఫ్‌సీకి అంత ఆదరణ ఉంటుంది. అయితే.. అలాంటి కేఎఫ్‌సీ నుంచి తాజాగా ఓ కస్టమర్‌కు చేదు అనుభవం ఎదురైంది. సరిగా ఉడకని చికెన్‌ పీస్‌లను సిబ్బంది వడ్డించారు. దీంతో కస్టమర్‌ ట్విట్టర్‌ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఫిర్యాదు చేసినా.. కనీసం పట్టించుకోలేదంటూ వాపోయాడు. ఈ సంఘటన హైదరాబాద్‌ నగరంలోని కూకట్‌పల్లిలో జరిగింది.

చికెన్‌ తినేందుకు ఓ వ్యక్తి కూకట్‌పల్లిలోని కేఎఫ్‌సీ సెంటర్‌కు వెళ్లాడు. ఆ తర్వాత ఆర్డర్‌ ఇవ్వగా.. కేఎఫ్‌సీ సిబ్బంది సరిగా ఉడకని చికెన్‌ను సర్వ్‌ చేశారు. అది చూసిన కస్టమర్‌ ఇలా ఉందేంటీ అంటూ ఫిర్యాదు చేశాడు. అయినా ఎవరూ పట్టించుకోలేదంటూ ట్విట్టర్‌లో తెలిపాడు. హైదరాబాద్‌లోని జెఎన్‌టీయూ మెట్రో కేఎఫ్‌సీ స్టోర్‌ నుంచి నుంచి తీసుకున్న చికెన్‌లో నాణ్యత లేదని.. పీస్ అస్సలు ఉడకలేదంటూ సాయి తేజ అనే కస్టమర్‌ పేర్కొన్నాడు. ఇలాంటి ఆహారాన్ని తింటే కస్టమర్లకు కడుపు సమస్యలు వస్తాయంటూ పేర్కొన్నాడు.

Also Read: Viral Video: వామ్మో.. భారీగా విరిగిపడిన కొండచరియలు.. ఒళ్లు గగుర్పొడుస్తున్న భయానక దృశ్యాలు

Lionel Messi: కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్.. ఎందుకో తెలుసా? వైరలవుతోన్న వీడియో

సింహాన్ని గాల్లో గింగిరాలు కొట్టించిన గేదె.. కొమ్ములతో పొడుస్తూ బీభత్సం.. వైరల్ వీడియో!

అమ్మాయి టిక్‌ టాక్‌ వీడియో చేస్తోంది..! అప్పుడే వాళ్ల అమ్మ వచ్చింది..? ఏం జరిగిందంటే..