విషాదం: ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు మృతి

చిత్తూరు జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడ్డారు. చిన్నారుల మృతితో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు విలపించారు.

విషాదం: ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు మృతి

Updated on: Jul 20, 2020 | 8:50 PM

చిత్తూరు జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడ్డారు. చిన్నారుల మృతితో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు విలపించారు.

చిత్తూరు జిల్లాలోని పుంగనూరు మండలం పట్రపల్లిలో ఈ విషాదఘటన చోటుచేసుకుంది. పట్రపల్లి తాండాకు చెందిన ఇద్దరు విద్యార్థులు స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీళ్లలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us