Thunderstorm: మంచిర్యాలలో ప్లైఓవర్‌పై పిడుగుపాటు.. ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి.. చిన్నారికి తీవ్ర గాయాలు

మంచిర్యాల జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షంలో ప్లైఓవర్‌పై వెళుతున్న బైక్‌పై పిడుగు పడింది. దీంతో బైక్‌పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి . మరో చిన్నారి తీవ్రంగా గాయాలు.

Thunderstorm: మంచిర్యాలలో ప్లైఓవర్‌పై పిడుగుపాటు.. ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి.. చిన్నారికి తీవ్ర గాయాలు
Thunderstorm On Bike

Updated on: Sep 20, 2021 | 1:11 PM

Thunderstorm on bike:  మంచిర్యాల జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షంలో ప్లైఓవర్‌పై వెళుతున్న బైక్‌పై పిడుగు పడింది. దీంతో బైక్‌పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో చిన్నారి తీవ్రంగా గాయపడింది.

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సీసీసీ కాలనికి చెందిన కుటుంబం ఫ్లైఓవర్ మీదకు వెళ్తోంది. అదే సమయంలో వర్షం కురుస్తోంది. ఈ సమయంలో రైల్వే వంతెన వద్ద బైక్‌పై పిడుగు పడింది.
ద్విచక్రవాహనంపై వెళ్తున్న వారిపై పిడుగుపాటుతో భార్య, భర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. మూడేళ్ల చిన్నారికి తీవ్రగాయాలు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read Also… AP CM YS Jagan: పరిషత్ ఫలితాలు మరింత బాధ్యతను పెంచాయి.. విపక్షాల కుట్రలు, కుయుక్తులు చెల్లవుః వైఎస్ జగన్

త్వరలో హైదరాబాద్‌లో బిచ్చగాళ్లు కనిపించరు..! కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..

Follow Us