Crime News: స్నానం చేస్తున్న వివాహిత వీడియో చిత్రీకరణ.. బ్లాక్‌మెయిల్‌‌కు పాల్పడుతూ అన్నదమ్ముళ్ల లైంగిక దాడి!

కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కీచకులు రెచ్చిపోయాడు.. స్నానం చేస్తున్న వివాహిత వీడియో చిత్రీకరించి, ఆపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.

Crime News: స్నానం చేస్తున్న వివాహిత వీడియో చిత్రీకరణ.. బ్లాక్‌మెయిల్‌‌కు పాల్పడుతూ అన్నదమ్ముళ్ల లైంగిక దాడి!
Molested Married Woman

Updated on: Oct 11, 2021 | 9:53 PM

Molested married Woman: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కీచకులు రెచ్చిపోయాడు.. స్నానం చేస్తున్న వివాహిత వీడియో చిత్రీకరించి, ఆపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అన్నదమ్ముళ్లు ఇద్దరు కలిసి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. నగరంలోని ప్రశాంతినగర్‌కు చెందిన ఓ వివాహితపై లైంగికదాడికి పాల్పడిన ఘటనలో ఇద్దరు అన్నదమ్ములపై ఆదివారం ఖానాపురం హవేలి స్టేషన్‌లో కేసు నమోదైంది.

పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. వివాహిత స్నానం చేస్తుండగా ఇంటి పక్కన ఉండే యువకుడు ప్రవీణ్‌ రాజ్‌ సెల్‌ఫోన్‌తో ఫొటోలు, వీడియోలు తీశాడు. వాటితో బ్లాక్‌ మెయిల్‌ చేసి లైంగికంగా లొంగదీసుకున్నాడు. సామాజిక మధ్యమాల్లో షేర్ చేస్తానంటూ వేధింపులకు పాల్పడుతూ.. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. అంతేకాకుండా ఇదే విషయాన్ని తన సోదరుడు గిరిధర్‌కు చెప్పాడు ప్రవీణ్ రాజ్.

అయితే, ఇదే అదునుగా అతని సోదరుడు గిరిధర్‌ కూడా బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు. తనను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేస్తున్నాడని వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా తనపై లైంగిక దాడి చేశారని, వేధింపులకు పాల్పడుతూ కులం పేరుతో దూషించారని బాధితురాలి ఫిర్యాదు చేసింది. వివాహిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఏసీపీ ఆంజనేయులు పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Read Also… Petrol Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు అందుకే పెరుగుతున్నాయి.. కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలి వివాదాస్పద వ్యాఖ్యలు..