Social Media Harassment: విజయవాడలో దారుణం.. యువతి నగ్న చిత్రాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఇద్దరు ఉన్నాదులు.

Social Media Harassment: సోషల్‌ మీడియాలో మహిళలపై వేధింపులు ఇటీవలి కాలంలో ఎక్కువుతున్నాయి. తాము చెప్పినట్లు వినకపోయినా, తమ మాటకు ఎదురు చెప్పినా సోషల్‌ మీడియాను ఉపయోగిస్తున్నారు...

Social Media Harassment: విజయవాడలో దారుణం.. యువతి నగ్న చిత్రాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఇద్దరు ఉన్నాదులు.

Updated on: Aug 21, 2021 | 9:08 PM

Social Media Harassment: సోషల్‌ మీడియాలో మహిళలపై వేధింపులు ఇటీవలి కాలంలో ఎక్కువుతున్నాయి. తాము చెప్పినట్లు వినకపోయినా, తమ మాటకు ఎదురు చెప్పినా సోషల్‌ మీడియాను ఉపయోగిస్తున్నారు మహిళలను మానసికంగా హింసిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి విజయవాడలో వెలుగులోకి వచ్చింది. బిహార్‌కు చెందిన రోహిత్‌ కుమార్‌ అనే యువకుడు విజయవాడలో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే స్నేహం పేరుతో ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆ క్రమంలోనే యువతితో సాన్నిహిత్యం పెంచుకున్న ఆ ప్రబుద్ధుడు ఆమెకు సంబంధించిన నగ్న చిత్రాలను సేకరించాడు.

ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా రోహిత్‌ తీరు నచ్చని యువతి అతనిని దూరం పెడుతూ వచ్చింది. దీంతో పగ పెంచుకున్న రోహిత్‌, కృష్ణ లంకకు చెందిన దండగుల గణేష్‌తో కలిసి యువతిని వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు. ఇందులో భాగంగానే సదరు యువతి పేరుతో ఓ నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను రూపొందించాడు. అనంతరం ఆ అకౌంట్‌లో యువతికి చెందిన నగ్న ఫొటోలను పోస్ట్‌ చేయడం ప్రారంభించారు. దీంతో విషయం తెలుసుకున్న యువతి సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు యువకులను అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆ ఇద్దరిని విచారిస్తున్నారు.

Also Read: కృష్ణా జిల్లాలో దంచికొట్టిన వర్షం.. మరో 3 రోజులు సేమ్ సీన్.. కీలక ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్

Spotify Survey: చిట్టికి ఫిదా అవుతోన్న హైదరాబాదీలు.. మ్యూజిక్‌ యాప్‌ స్పోటిఫై సర్వేలో ఆసక్తికర విషయాలు.

ఎత్తుకెళ్లి నరకడమే.. యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్‌కి వైస్ ఛాన్సలర్ అన్న కొడుకు వార్నింగ్.! వైరల్ అవుతోన్న ఆడియో