శ్రీకాకుళం జిల్లాలో పండుగ పూట విషాదం.. హోలీ వేడుకల అనంతరం స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకుల గల్లంతు..

|

Mar 29, 2021 | 10:24 PM

Three Youngsters Missing : శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు యువకులు స్నానానికని వెళ్లి గల్లంతయ్యారు. స్థానిక పోలీసులు తెలిపిన

శ్రీకాకుళం జిల్లాలో పండుగ పూట విషాదం.. హోలీ వేడుకల అనంతరం స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకుల గల్లంతు..
Three Youngsters Missing
Follow us on

Three Youngsters Missing : శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు యువకులు స్నానానికని వెళ్లి గల్లంతయ్యారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఆశీష్ శర్మ , చోటు, సందీప్‌ ఉపాధి నిమిత్తం జిల్లాలో నివసిస్తున్నారు. అయితే సోమవారం హోలీ పండుగ సందర్భంగా ముగ్గురు యువకులు కలిసి ఎంతో ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. అనంతరం స్నానంకోసమని కళింగపట్నం బీచ్‌కి వెళ్లారు. స్నానం చేస్తూ ఒక్కసారిగా యువకులు గల్లంతైనట్లు పోలీసులు తెలిపారు. సమాచారం యువకుల కుటుంబ సభ్యులకు చేరవేసినట్లు తెలుస్తోంది. మృతదేహాల కోసం గాలింపు చేస్తున్నట్లు వివరించారు.

ఇదిలా ఉంటే.. ఇటీవల ప్రకాశం జిల్లా వేటపాలెం దగ్గరలోని కటారివారిపాలెం సముద్ర తీరంలో కూడా ముగ్గురు విద్యార్థులు మృతిచెందారు. గుంటూరులోని ఏటి అగ్రహారానికి చెందిన మద్దూరి భరత్ రెడ్డి (20), చుట్టుగుంటకు చెందిన మొగిలి ఉష(20), గట్టు మహేశ్‌ (20)తో పాటు మానస, జైశ్వంత్‌ ఆదివారం మధ్యాహ్నం కటారివారిపాలెం సముద్ర తీరానికి వచ్చారు. ఈ ఐదుగురూ కలిసి సముద్రంలో స్నానానికి దిగి.. సరదాగా ఈత కొడుతుండగా.. అలల ధాటికి గల్లంతయ్యారు. ఈ క్రమంలో స్థానికులు, మత్స్యకారులు వెంటనే వారిని గమనించి మానస, జైశ్వంత్‌లను కాపాడి ఒడ్డుకు చేర్చారు. భరత్ రెడ్డి, ఉష, మహేశ్‌ ముగ్గురూ గల్లంతయ్యారు.

అరగంట తర్వాత భరత్ రెడ్డి, ఉషా మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. మహేశ్‌ కోసం ఈతగాళ్లు సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఆసుపత్రికి తరలించారు. మహేష్‌ ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులు ఉష బి ఫార్మసీ చదువుతుండగా.. భరత్‌ బీటెక్ చదువుతున్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సాగర్ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా డాక్టర్‌ పానుగోతు రవికుమార్‌.. వైద్య వృత్తిని వదిలి ప్రజా సేవ వైపు పయనం

Woman Growing Beard: యువతికి 15 ఏళ్లుగా పెరుగుతున్న గడ్డం.. ఆమె మాత్రం షేవింగ్‌కు నో.. రీజన్ ఇదే

BHEL Recruitment 2021: హైదరాబాద్‌ బీహెచ్‌ఈఎల్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. తెలంగాణ అభ్యర్థులకు ప్రాధాన్యం..