Shocking Visuals: నిర్దాక్షిణ్యంగా పదిహేడేళ్ళ బాలికను రెండంతస్థుల భవనంపై నుంచి నెట్టేసిన దుండగులు.. షాకింగ్ వీడియో!

|

Jun 23, 2021 | 7:06 PM

Shocking Visuals: పదిహేడేళ్ళ మైనర్ బాలికను క్రూరంగా రెండంతస్థుల భవనం పై నుంచి కిందకు నెట్టేశారు దుండగులు. ఈ ఘటన ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది.

Shocking Visuals: నిర్దాక్షిణ్యంగా పదిహేడేళ్ళ బాలికను రెండంతస్థుల భవనంపై నుంచి నెట్టేసిన దుండగులు.. షాకింగ్ వీడియో!
Shocking Visuals
Follow us on

Shocking Visuals: పదిహేడేళ్ళ మైనర్ బాలికను క్రూరంగా రెండంతస్థుల భవనం పై నుంచి కిందకు నెట్టేశారు దుండగులు. ఉత్తరప్రదేశ్ మధుర పట్టణంలో జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు అందరినీ తీవ్ర విషాదంలోకి నెట్టేస్తోంది. సీసీ టీవీ ఫుటేజ్ లలో ఈ ఘటన రికార్డు అయింది. రాత్రి సమయంలో భవనం పైనుంచి రోడ్డు మీదకు ఆ బాలికను నెట్టివేశారు. ఒక్కసారిగా రోడ్డుపై పడిన ఆ బాలికను చూసి రోడ్డు మీద వెళుతున్న వారు ముందు కంగారు పడి పరుగులు తీశారు. తరువాత దగ్గరకు వచ్చి ఆమెను పరిశేలించి రక్షించేందుకు ప్రయత్నించారు. ఘటన పై వారు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చావుతో పోరాడుతోంది.

పోలీసు సూపరింటెండెంట్ (మధుర గ్రామీణ) శ్రీష్ చంద్ర పిటిఐతో మాట్లాడుతూ తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలి సోదరుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన తరువాత నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ సంఘటనపై బాలిక సోదరుడు దినేష్ సింగ్ చెప్పిన వివరాలిలా ఉన్నాయి. నిందితులు ముగ్గురూ తన సోదరిని ఒక సంవత్సరం నుంచి వేధిస్తున్నారని పేర్కొన్నారు. “ రాత్రి 8 గంటల సమయంలో, మా నాన్నకు తెలియని నంబర్ నుండి కాల్ వచ్చింది. ఎవరు మాట్లాడుతున్నారని కాలర్ అడిగారు. లొకేషన్ తెలుసుకోవాలని కోరారు. మా తండ్రి తాను చాతా నుండి మాట్లాడుతున్నానని చెప్పారు. అదేవిధంగా ఆయన పేరు కూడా కాల్ చేసిన వ్యక్తికి చెప్పారు.”అని సోదరుడు పిటిఐకి చెప్పాడు. కొద్దిసేపటి తరువాత ముగ్గురు వ్యక్తులు మోటారుసైకిల్‌పై వచ్చి మా ఇంట్లోకి ప్రవేశించారు. వారు నా తల్లి, సోదరితో సహా నా కుటుంబ సభ్యులపై దాడి చేశారు. వారిలో ఇద్దరు నా సోదరిని బలవంతంగా రెండవ అంతస్తుకు తీసుకెళ్ళి బాల్కనీ నుండి విసిరేశారు. దీంతో ఆమె వెన్ను విరిగింది, ”అని అతను ఆరోపించాడు.

ఈ ఘటన మొత్తం దగ్గరలోని సీసీ టీవీ ఫుటేజ్ లలో రికార్డు అయింది. ఈ వీడియోను జర్నలిస్ట్ అనుజా జైస్వాల్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. బాలిక వెన్నెముక విరిగి ఆసుపత్రిలో చికితా పొందుతున్నట్లు పేర్కొన్నారు. “ఆమె ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. ఆమె వెన్నెముక తో పాటు శరీరంలోని ఇతర భాగాలలో తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉంది ”అని బాలిక తండ్రి ప్రేమ్ పాల్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. నిందితులు బీహార్ స్థానికులు అని చెబుతున్నారు.

ఇదిలా ఉండగా సోమవారం రాత్రి సమయంలో ఘటన జరుగగా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బాధితురాలి కుటుంబం ప్రయత్నించింది. అయితే, పోలీసులు మరుసటి రోజు రావాలని చెప్పారని వారు ఆరోపిస్తున్నారు. అయితే, బాలిక కుటుంబ సభ్యుడు మంగళవారం ఉదయం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చారని, ఆ తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు ఎస్పీ (గ్రామీణ) శ్రీష్‌ చంద్ర తెలిపారు. “వెంటనే పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మూడవ నిందితుడిని త్వరలో అరెస్టు చేస్తామని, తదుపరి చర్యలు కొనసాగుతున్నాయని ఆయన విలేకరులతో అన్నారు.

Also Read: Nellore twins death: అనుమానాస్పద స్థితిలో 10 నెలల వయసున్న కవలల మృతి.. పోలీసులు విచారణలో విస్తుపోయే విషయాలు..!

Dawood Ibrahim’s Brother Arrested : డ్రగ్స్ కేసులో దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కష్కర్ అరెస్ట్..