Tamil Nadu: వాటర్‌ ట్యాంక్‌ క్లీన్‌ చేస్తుండగా వెలువడిన విష వాయువులు.. ఊపిరాడక ముగ్గురి మృతి..

|

Apr 15, 2022 | 3:59 PM

Chennai: తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో విషాదం చోటుచేసుకుంది. వాటర్‌ ట్యాంక్‌ శుభ్రం చేస్తుండగా విషవాయువులు వెలువడడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు.

Tamil Nadu: వాటర్‌ ట్యాంక్‌ క్లీన్‌ చేస్తుండగా వెలువడిన విష వాయువులు.. ఊపిరాడక ముగ్గురి మృతి..
Follow us on

Chennai: తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో విషాదం చోటుచేసుకుంది. వాటర్‌ ట్యాంక్‌ శుభ్రం చేస్తుండగా విషవాయువులు వెలువడడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరొకరి ఆస్పత్రిలో చికిత్స పొందతున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. చెన్నై నగరంలోని తిరుముల్లైవాయల్ లో ఉన్న ప్రేమ్ కుమార్ స్థానికంగా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇంట్లో ఉన్న వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఒక్కసారిగా విషవాయువులు వెలువడ్డాయి. ఊపిరాకడపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డాడు.ఈ విషయం తెలుసుకున్న కుమారుడు ప్రదీప్‌ తండ్రిని రక్షించేందుకు వాటర్‌ ట్యాంక్‌లోకి దిగాడు. ఆతర్వాత వారిద్దరిని కాపాడేందుకు మరో ఇద్దరు ట్యాంక్‌లోకి దిగడంతో ఊపిరాడక అక్కడికక్కడే పడిపోయారు. సమాచారం అందుకున్న స్థానికులు నలుగురిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమద్యం లోనే ముగ్గురు ప్రాణాలో కోల్పోయారు.

కాగా ఈ ప్రమాదంలో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన మరొకరు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి కూడా ఆందోళన కరంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

Also Read: Pooja Hegde: ఆ క్రేజీ ప్రాజెక్ట్‌లో స్పెషల్ సాంగ్‌లో మెరవనున్న బుట్టబొమ్మ.. రంగస్థలం తర్వాత మరోసారి

Summer Drink: చాయ్ ప్రియుల కోసం..వేసవిలో హైడ్రేట్‌గా మార్చే ‘సమ్మర్ కూల్ టీ’.. ఎలా తయారు చేయాలో తెలుసా..

Gujarat Election 2022: గుజరాత్‌ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీలో కుత కుతలు.. ఆప్‌లోకి దూకేందుకు కీలక నేతలు రెడీ..