బిజినెస్‌మ్యాన్‌ హత్య.. ‘టిక్‌టాక్’‌ స్టార్‌ సహా 13 మంది అరెస్ట్‌

దారుణ హత్యకు గురైన బిజినెస్‌మ్యాన్‌, బెంగళూరు కార్పొరేటర్‌ మేనల్లుడు వినోద్‌ కుమార్‌ కేసును పోలీసులు చేధించారు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు రామనగర్‌ జిల్లాలో 13 మందిని అరెస్ట్ చేశారు.

బిజినెస్‌మ్యాన్‌ హత్య.. టిక్‌టాక్‌ స్టార్‌ సహా 13 మంది అరెస్ట్‌

Edited By:

Updated on: Jul 12, 2020 | 3:54 PM

దారుణ హత్యకు గురైన బిజినెస్‌మ్యాన్‌, బెంగళూరు కార్పొరేటర్‌ మేనల్లుడు వినోద్‌ కుమార్‌ కేసును పోలీసులు చేధించారు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు రామనగర్‌ జిల్లాలో 13 మందిని అరెస్ట్ చేశారు. అందులో టిక్‌టాక్‌ స్టార్‌గా చెప్పుకునే టిక్‌టాక్‌ నవీన్‌ అలియాస్ స్మైలీ నవీన్ ఉన్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని అంజనాపుర కార్పొరేటర్‌ సోమశేఖర్ మేనల్లుడైన వినోద్ కుమార్ బుధవారం దారుణ హత్యకు గురయ్యారు. బెంగళూరు సిటీ శివారు ప్రాంతంలోని తన సోదరి ఇంటికి వెళ్లి వచ్చే సమయంలో వినోద్‌ కుమార్‌ కారును చుట్టుముట్టిన కొంతమంది.. అతడిని బయటకు లాగి దారుణంగా కొట్టారు. సోదరి ఇంటి ముందే దుండగులు అతడిపై దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాలపాలవ్వగా.. ఆసుపత్రికి తరలించే లోపు వినోద్ మృతి చెందాడు. బిజినెస్‌లో ఆయన ప్రత్యర్ధులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని భావించిన పోలీసులు.. ఆ కోణంలోనూ దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో 13 మందిని అరెస్ట్ చేశారు. వారిలో టిక్‌టాక్ నవీన్‌తో పాటు మంజేష్‌ అలియాస్ అవలహల్లి మంజ, శ్రీనివాస్, రవి అలియాస్ రవి కిరణ్, లోకేష్‌, అరిఫ్, పవన్‌, మహేష్, మధు, రాఘవ్‌, విఘ్నేష్‌, సునీల్‌, డి. మధు ఉన్నారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పలు కోణాల్లో వారిని విచారిస్తున్నారు.