Attempt To Break ATM: గచ్చిబౌలిలో ఏటీఎమ్‌ చోరీకి యత్నించిన ఆగంతకుడు.. ఫొటోలు షేర్‌ చేసిన పోలీసులు..

|

Apr 03, 2021 | 5:42 PM

Attempt To Break ATM: టెక్నాలజీ ఎంత పెరిగినా.. నేరాలు చేస్తే సులువుగా దొరికిపోతామని తెలిసినా కేటుగాళ్ల ఆగడాలకు మాత్రం అడ్డుకట్టపడట్లేదు. మరీ ముఖ్యంగా పూర్తిగా సెక్యూరిటీ పరిధిలో ఉండే ఏటీఎమ్‌ సెంటర్లపై దాడులకు దిగడం ఇటీవల మరీ ఎక్కువైపోయింది. ఓ వైపు..

Attempt To Break ATM: గచ్చిబౌలిలో ఏటీఎమ్‌ చోరీకి యత్నించిన ఆగంతకుడు.. ఫొటోలు షేర్‌ చేసిన పోలీసులు..
Atm Thief In Gachhibowli
Follow us on

Attempt To Break ATM: పెరిగిన టెక్నాలజీతో.. నేరాలు చేస్తే సులువుగా దొరికిపోతామని తెలిసినా కేటుగాళ్ల ఆగడాలకు మాత్రం అడ్డుకట్టపడట్లేదు. మరీ ముఖ్యంగా పూర్తిగా సెక్యూరిటీ పరిధిలో ఉండే ఏటీఎమ్‌ సెంటర్లపై దాడులకు దిగడం ఇటీవల మరీ ఎక్కువైపోయింది. ఓ వైపు సీసీ కెమెరాలు ఉన్నాయని తెలిసి కూడా రెచ్చిపోతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఏటీఎమ్‌ను ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన ఓ దుండగుడు కెమెరా కంటికి చిక్కాడు.
వివరాల్లోకి వెళితే.. ఈ రోజు ఉదయం (శనివారం) ఓ గుర్తుతెలియని వ్యక్తి ఉదయం నాలుగు గంటల సమయంలో గచ్చిబౌలిలో ఉన్న ఓ ఏటీఎమ్‌లోకి చోరీకి వెళ్లాడు. లోపలికి వెళ్లనయితే వెళ్లాడు కానీ ఏటీఎమ్‌ను ఎలా దొంగలించాలో తెలియలేదు. కాసేపు విశ్వప్రయత్నం చేసి ఎంతకూ ఏటీఎమ్‌ ఓపెన్‌ కాకపోయే సరికి అక్కడి నుంచి తిరుగు పయణమయ్యాడు. అయితే ఆ దొంగ అక్కడ సీసీ కెమెరా ఉన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోక పోవడం గమనార్హం. ఆ సీసీటీవీ ఫుటేజ్‌లో సదరు వ్యక్తి ఫుటేజ్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఈ ఫొటోలను గచ్చిబౌలి పోలీసులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఎవరైనా ఆ వ్యక్తిని గుర్తుపడితే గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ ఫోన్‌ నెంబర్‌ 94906 17127కు లేదా సైబరాబాద్‌ వాట్సాప్‌ నెంబర్‌ 9490617444కు సమాచారం అందించమని కోరారు. మరి ఆ దొంగపై ఓ లుక్కేయండి ఒకవేళ గుర్తు పడితే పోలీసులకు అప్పగించండి.. సమాజంలో మీ బాధ్యతను పాటించండి.

పోలీసులు చేసిన ట్వీట్..

Also Read: బెంగుళూరు డ్రగ్స్ కేసులో వెలుగుచూస్తున్న సంచలన నిజాలు.. బయటపడుతున్న తెలంగాణ ప్రజాప్రతినిధుల పేర్లు..!

Rajasthan: బాధితురాలిపై లైంగిక వేధింపులు.. రాజకీయ దుమారంతో ఏసీపీని డిస్మిస్ చేసిన ప్రభుత్వం

‘వాళ్లు కరుసైపోవడమేకాదు, అకారణంగా ఇతరుల ప్రాణాలు తీసేసినవాళ్లుగా రికార్డులకెక్కుతున్నారు’