Viral News: దొంగతనంలో ఇది మరో లెవల్‌… ఏకంగా బ్రిడ్జినే కొట్టేశారు..

Viral News: దొంగకు చెప్పే మేలు అనే సామెత చాలా పాపులర్‌. అంటే దొంగతనం చేసే వ్యక్తికి చెప్పు దొరికినా సరే వదలడు అని అర్థం. బిహార్‌లో జరిగిన ఓ సంఘటన చూస్తే ఇది అక్షరాల నిజం అనిపిస్తుంది. బిహార్‌కు చెందిన కొందరు దొంగలు ఏకంగా బ్రిడ్జినే కొట్టేశారు...

Viral News: దొంగతనంలో ఇది మరో లెవల్‌... ఏకంగా బ్రిడ్జినే కొట్టేశారు..

Updated on: May 04, 2022 | 10:13 PM

Viral News: దొంగకు చెప్పే మేలు అనే సామెత చాలా పాపులర్‌. అంటే దొంగతనం చేసే వ్యక్తికి చెప్పు దొరికినా సరే వదలడు అని అర్థం. బిహార్‌లో జరిగిన ఓ సంఘటన చూస్తే ఇది అక్షరాల నిజం అనిపిస్తుంది. బిహార్‌కు చెందిన కొందరు దొంగలు ఏకంగా బ్రిడ్జినే కొట్టేశారు. బ్రిడ్జిని ఎలా దొంగతనం చేస్తారనేగా మీ సందేహం. అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. వివరాల్లోకి వెళితే.. బిహార్‌లోని బాంకా జిల్లా చందన్‌ బ్లాక్‌లో కొందరు దొంగలు 80 అడుగుల ఇనుప వంతెనను దొంగలించారు. గ్యాస్‌ కట్టర్ల సహాయంతో వంతెనను ముక్కలుగా చేసి ఎత్తుకెళ్లారు.

ఇలా ఏకంగా 70 శాతం వంతెనను మాయం చేసేశారు. ఈ వంతెనను 2022లో 80 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పుతో నిర్మించారు. అయితే కొత్తగా మరో రెండు బ్రిడ్జిలను నిర్మించడంతో ప్రస్తుతం దీనిని వినియోగించడం లేదు. దీంతో ఈ వంతెనపై దొంగల కళ్లు పడ్డాయి. అనుకున్నదే తడవుగా బ్రిడ్జిన్‌ ముక్కలు చేసి బ్రిడ్జి దొంగతనానికి గురైనట్లు తమకు సమాచారం అందలేదని, ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలపడం గమనార్హం. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కాదు. గత నెలలో రోహ్తాస్‌ జిల్లాల్లో 60 అడుగుల వంతెనను ఎత్తుకెళ్లారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: Rahul Gandhi: మరోసారి రాహుల్‌కు పోటీ ఇవ్వనున్న కేంద్ర మంత్రి.. అప్పుడు అమేథీ.. ఇప్పుడు వాయనాడ్..

Health Tips: రోజుకు మీరు ఎన్ని లీటర్ల నీళ్లు తాగుతున్నారు ?.. ఇంతకీ నీరు ఎంత శాతం తాగితే అద్భుత ప్రయోజనాలో తెలుసా..

Tanushree Dutta: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ హీరోయిన్.. ఉజ్జయిని ఆలయానికి వెళ్తుండగా..