Kamareddy District Murder attempt: కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. జిల్లా కేంద్రంలోని బర్కత్ పుర కాలనీలో గుర్తుతెలియని ఓ వ్యక్తి.. మహిళ గొంతు కోసి పారిపోయాడు. ఇంట్లో ఉన్న మహిళపై అగంతకుడు ఒక్కసారిగా దాడి చేశాడు. తేరుకునే లోపే పదునైన ఆయుధంతో గొంతు కోసి హతమార్చేందుకు ప్రయత్నించాడు. ఆమె అరుపులు విని ఇరుగు పొరుగు అప్రమత్తం అవ్వడంతో దుండుగుడు అక్కడి నుంచి పారిపోయాడు. మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు ఆమెను కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు బర్కత్‌పుర కాలనీకి చెందిన నిషాక్ ఫిర్దొస్‌గా పోలీసులు గుర్తించారు. కాగా, ఘటనకు సంబంధించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ దారుణానికి సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి ఖర్చీఫ్ ధరించుకుని వచ్చి.. ఇంటి ముందు పాత్ర కడుగుతుండగా మహిళపై దుండగుడు దాడి చేశాడని స్థానికులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.