High Court: మరోసారి తెరపైకి మరియమ్మ లాకప్ డెత్ కేసు.. సీబీఐ దర్యాప్తు అవసరమన్న హైకోర్టు ధర్మాసనం!

|

Nov 10, 2021 | 7:39 PM

గతంలో సంచలనం సృష్టించిన అడ్డగూడురు లాక్‌డెత్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. పీయూసీఎల్ పిల్ పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.

High Court: మరోసారి తెరపైకి మరియమ్మ లాకప్ డెత్ కేసు.. సీబీఐ దర్యాప్తు అవసరమన్న హైకోర్టు ధర్మాసనం!
Mariamma Lockup Death Case
Follow us on

High Court Mariyamma Lock-up Death Case:  గతంలో సంచలనం సృష్టించిన అడ్డగూడురు లాక్‌డెత్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. పీయూసీఎల్ పిల్ పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. మరియమ్మ మృతిపై హైకోర్టుకు అందిన నివేదికపై ఆధారంగా మరియమ్మ లాకప్‌డెత్ కేసును సీబీఐకి అప్పగించదగినదని అభిప్రాయపడింది న్యాయస్థానం. ఈనెల 22న విచారణకు రావాలని సీబీఐ ఎస్పీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు పూర్తి వివరాలను అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌కు అప్పగించాలని ఏజీని ఆదేశించింది.

లాకప్‌లో ఉన్న సమయంలో మరియమ్మ చనిపోవడానికి బాధ్యులైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది హైకోర్టు. న్యాయస్థానం అడిగిన ప్రశ్నలకు ఎస్ఐ, కానిస్టేబుల్ ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు ఏజీ ధర్మాసనానికి వివరించారు. అలాగే, మరియమ్మ కుటుంబానికి ప్రభుత్వం తరుఫున నష్ట పరిహారం చెల్లించినట్లు పేర్కొన్నారు. అయితే, పరిహారం ఇస్తే పోయిన మరియమ్మ ప్రాణం తిరిగి తీసుకురాలేనిదని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.

అయితే, మరియమ్మకు ఇతర అనారోగ్య సమస్యలు ఉండటం వల్లే హార్ట్ ఎటాక్‌తో చనిపోయినట్లు అడ్వకేట్ జనరల్ చెప్పిన సమాధానంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రెండో పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో మృతురాలి శరీరంపై గాయాలున్న విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. లాకప్‌లో ఉన్న మహిళను గుండె ఆగిపోయేలా ఎవరైనా కొడతారా అంటూ వ్యాఖ్యానించింది ధర్మాసనం. అందుకే ఈకేసును సీబీఐ వంటి స్వతంత్ర సంస్థల దర్యాప్తు అవసరమంది. సీబీఐ, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చి నోటీసులు జారీ చేసింది హైకోర్టు. ఈ కేసు విచారణను ఈనెల 22కి వాయిదా వేసింది న్యాయస్థానం.

Read Also… Crime News: ప్రేమించిన అమ్మాయి తనతో మాట్లాడొద్దన్నందుకు ఘాతుకం.. యువతిపై దాడి.. 18 కత్తిపోట్లు!