ఆ గొలుసు దొంగ..మాజీ సర్పంచ్..

|

Nov 08, 2019 | 3:14 AM

అతడు దాదాపు గ్రామ సర్పంచ్‌గా..10 ఏళ్లు పనిచేశాడు. ఊర్లో మంచి పలుకుబడినే సంపాదించాడు. కట్ చేస్తే గొలుసు దొంగగా మారాడు. చైన్ స్నాచింగ్‌ చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అసలు ఏమైంది..అతడు ఎందుకు దొంగగా మారాడు. అతనిపై ఆ గ్రామ ప్రజలకు ఎటువంటి ఒపినియన్ ఉంది. ఈ స్టోరీలో చూద్దాం.. సరిగ్గా మూడంటే..మూడు రోజుల క్రితం  రంగారెడ్డి జిల్లా మహాలింగపురం గ్రామంలో  ఒక వృద్ధురాలి మెడలో నుంచి బంగారం గొలుసు అపహరణకు గురైంది.  గ్రామానికి చెందిన వృద్ధ […]

ఆ గొలుసు దొంగ..మాజీ సర్పంచ్..
Follow us on

అతడు దాదాపు గ్రామ సర్పంచ్‌గా..10 ఏళ్లు పనిచేశాడు. ఊర్లో మంచి పలుకుబడినే సంపాదించాడు. కట్ చేస్తే గొలుసు దొంగగా మారాడు. చైన్ స్నాచింగ్‌ చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అసలు ఏమైంది..అతడు ఎందుకు దొంగగా మారాడు. అతనిపై ఆ గ్రామ ప్రజలకు ఎటువంటి ఒపినియన్ ఉంది. ఈ స్టోరీలో చూద్దాం..

సరిగ్గా మూడంటే..మూడు రోజుల క్రితం  రంగారెడ్డి జిల్లా మహాలింగపురం గ్రామంలో  ఒక వృద్ధురాలి మెడలో నుంచి బంగారం గొలుసు అపహరణకు గురైంది.  గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు ఇద్దరు బస్ కోసం వేచి ఉన్న సమయంలో… అక్కడికి బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి లిప్ట్ ఇస్తానంటూ వృద్ధురాలిని ఎక్కించుకున్నాడు. పక్కా ప్లాన్‌తోనే వచ్చిన దుండగుడు కొంతదూరం వెళ్లాక పొలాల్లోకి తీసుకెళ్లి భయపెట్టి ఆమె దగ్గర ఉన్న బంగారాన్ని లాక్కొని వైపు పారిపోయాడు. షాక్‌కు గురైన ఆ వృద్ద దంపతులు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

రంగంలోకి దిగిన ఖాకీలు మరుసటి రోజు.. బీడీఎల్ ఫ్యాక్టరీ దగ్గర తనిఖీలు చేస్తుండగా అటువైపు నుంచి వచ్చిన ఓ వ్కక్తి పోలీసులకు పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో అనుమానం వచ్చిన స్టేషన్‌కి తీసుకెళ్లారు. మంచిగా అడిగితే మాటలు దాటేస్తుండటంతో..ఖాకీలు తమదైన స్టైల్లో విచారించగా నిజం ఒప్పుకున్నాడు. నిందితుడిని  సదాశివ పెట్ మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన పట్లోళ్ల విష్ణువర్ధన్ రెడ్డిగా గుర్తించారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. సదరు దొంగ 2001 నుంచి 2011 వరకు 10సంవత్సరాలు వెంకటాపురం గ్రామానికి సర్పంచ్‌గా పనిచేశాడు. విషయం తెలిసిన గ్రామస్థులు ఒక్కసారిగా షాక్ తిన్నారు.  నిందితుడి నుంచి రెండున్నర తులాల బంగారం, మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కాగా కొన్నాళ్లుగా విష్ణువర్థన్ రెడ్డి తాగుడుకు బానిసయ్యాడు. జల్సాలకు డబ్బులు లభించకపోవడంతో దొంగతనాలవైపుకు మళ్లాడు.