Extra Marital Affair: ఓ యువకుడు తన తండ్రి మరో మహిళ గుట్టుగా సాగిస్తున్న అక్రమ సంబంధం వ్యవహారాన్ని బట్టబయలు చేశాడు. ఏకంగా 800 కిలోమీటర్లు వారిని వెంబడించి.. ఓ హోటల్‌లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అంతేకాదు.. వారి వీడియోను నెట్టింట్లోకి వదిలాడు. ఆ తరువాత వాళ్ల అమ్మకు ఫోన్ చేసి.. నువ్వు అనుమాంచింది నిజమే అమ్మా అంటూ చెప్పాడు. తండ్రి గట్టును రట్టు చేసిన తనయుడి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గ్వాలియర్‌కు చెందిన అలోక్ చౌదరి(62) అనే వ్యక్తి భార్య, ఓ కుమారుడు ఉన్నారు. అలోక్ చౌదరి ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. అయితే, అతనికి మరో మహిళతో అక్రమ సంబంధం ఉంది. ఫేస్‌బుక్‌లో పరిచయం మహిళతో అలోక్ చౌదరి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అయితే, అలోక్ చౌదరి భార్యకు అతని వ్యవహార శైలిపై అనుమానం వచ్చింది. తన భర్త మరో మహిళతో ఉంటున్నట్లుగా అనుమానించింది. ఇదే విషయాన్ని తన కొడుక్కి చెప్పింది. తండ్రిపై నిఘా పెట్టాల్సిందిగా కొడుక్కి సూచించింది. అయితే, తాజాగా పని, క్యాంప్‌కు వెళ్లాలి అంటూ ఇంట్లో భార్యకు చెప్పాడు అలోక్ చౌదరి. అయితే, అతని మాటలో తేడా కొట్టడంతో.. భార్య అనుమానం మరింత బలపడింది. ఇదే విషయాన్ని తన కొడుక్కి చెప్పింది. తండ్రి ఫాలో అవ్వమని సూచించింది.
తల్లి చెప్పినట్లే ఆ యువకుడు తన తండ్రిని ఫాలో అయ్యాడు. అలోక్ చౌదరి ముందుగా గ్వాలియర్ నుంచి జైపూర్‌కు వెళ్లాడు. అక్కడ తన ప్రేయసితో కలిసి ఉజ్జయినికి వెళ్లాడు. ఉజ్జయినిలోని మహాకాల్ దేవాలయం ప్రాంతంలో ఓ హోటల్‌లో గదిని బుక్ చేసుకున్నారు. అక్కడికి వెళ్లి వారు ఏకాంతంగా ఉన్నారు. అప్పటికే వారిని వెంబడిస్తూ వచ్చిన తనయుడు.. వారు ఏకాంతంగా ఉండగా నేరుగా గదిలోకి ప్రవేశించాడు. వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. వారి వ్యవహారాన్నంతా తన ఫోన్ కెమెరాలో వీడియో చిత్రీకరించాడు. తన తల్లికి, పోలీసులకు వెంటనే సమాచారం అందించాడు. అయితే, అలోక్ చౌదరి వ్యవహారంపై అతని తనయుడు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తన తండ్రికి మరో మహిళకు అక్రమ సంబంధం ఉందని తన తల్లి చెబితే.. నమ్మలేదని, కానీ స్వయంగా చూడటంలో షాక్ అయ్యానని మీడియాకు తెలిపాడు. కాగా, తాను రికార్డ్ చేసిన వీడియోను సదరు వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అది కాస్తా వైరల్‌గా మారింది. మరోవైపు ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also read:
Samantha: దసరా రోజు కీలక ప్రకటన చేయనున్న సమంత.. ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెప్పే అవకాశం..
Hyderabad: ఓల్డ్ సిటీ మర్డర్ కేసులో ఎస్‌ఐపై వేటు.. ప్రాణ హాని ఉందని చెప్పిన పట్టించుకోలదని..