Hyderabad: సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా

ప్రేమ వ్యవహారం మరో యువకుడిని బలి తీసుకుంది. తన కూతురుని ప్రేమిస్తున్నాడని, ఆమెతో పెళ్లికి సిద్ధమయ్యాడని తెలుసుకున్న యువతి కుటుంబసభ్యులు యువకుడిని చంపేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో సదరు యువకుడు దారుణ హత్యకు...

Hyderabad: సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా
Crime

Edited By:

Updated on: Jul 04, 2022 | 3:19 PM

ప్రేమ వ్యవహారం మరో యువకుడిని బలి తీసుకుంది. తన కూతురుని ప్రేమిస్తున్నాడని, ఆమెతో పెళ్లికి సిద్ధమయ్యాడని తెలుసుకున్న యువతి కుటుంబసభ్యులు యువకుడిని చంపేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో సదరు యువకుడు దారుణ హత్యకు గురవడం సంచలనంగా మారింది. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో నారాయణ రెడ్డి అనే వ్యక్తి తన ఫ్రెండ్ తో కలిసి నివాసముంటున్నాడు. నారాయణరెడ్డి ఏడాది క్రితం ఓ యువతిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు ఆమెను బలవంతంగా ఇంటికి తీసుకెళ్లారు. అయినప్పటికీ యువతి, నారాయణరెడ్డి మధ్య ఫోన్ కాల్స్ నడుస్తుండేవి. దీన్ని గమనించిన యువతి తల్లిదండ్రులు, బంధువులు నారాయణ రెడ్డిని చంపేయాలని నిర్ణయించుకున్నారు. ఇదే సమయంలో నారాయణరెడ్డి కనిపించడం లేదంటూ కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదైంది. కంప్లైంట్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు.. నారాయణరెడ్డి ఫోన్ కాల్‌డేటా ఆధారంగా శ్రీనివాస్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరికీ ముందే పరిచయం ఉండటంతో వాళ్లిద్దరితో పాటు మరికొంతమంది ఓ చోట మందుకొట్టారు. ఆ క్రమంలో వారిమధ్య ఘర్షణ జరిగింది. దీంతో నారాయణరెడ్డిని గొంతు నులిమి చంపేశారు. డెడ్ బాడీని జిన్నారం అటవీ ప్రాంతంలో పడేసి, పెట్రోల్‌ పోసి నిప్పంటించారు.

శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడు చెప్పిన వివరాల మేరకు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. యువతి కుటుంబసభ్యులే నారాయణరెడ్డిని హత్య చేయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

Loading...
Unable to load recommendations.
Follow Us