Juttada murders: కన్నకూతుర్ని పాడు చేసినందుకే నరమేధం అన్న అప్పలరాజు.. బాధితుడు విజయ్ వెర్షన్ ఇది‌

కన్నకూతుర్ని పాడు చేసినందుకు.. అదొక్కటే.. అరడజను హత్యలకు అప్పల్రాజు చెబుతున్న కారణం ఇది. మరి దీనికి బాధితుడు విజయ్ సమాధానం ఏంటి?.

Juttada murders: కన్నకూతుర్ని పాడు చేసినందుకే నరమేధం అన్న అప్పలరాజు.. బాధితుడు విజయ్ వెర్షన్ ఇది‌
Vizag Murders

Updated on: Apr 18, 2021 | 8:14 AM

కన్నకూతుర్ని పాడు చేసినందుకు.. అదొక్కటే.. అరడజను హత్యలకు అప్పలరాజు చెబుతున్న కారణం ఇది. మరి దీనికి బాధితుడు విజయ్ సమాధానం ఏంటి?. అప్పలరాజు హత్యల కహానీ వెనుక ఉన్న మిస్టరీ ఏంటి?. టీవీ9 ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలలో బాధితులు ఏం చెప్పారు?

జుత్తాడ మారణకాండలో నిందితుడు అప్పలరాజును రిమాండుకు తరలించారు. అంతకన్నా ముందు అతడికి కేజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు పోలీసులు. కోవిడ్‌ టెస్ట్‌ చేసిన తర్వాత తరువాత కూల్‌గా పోలీస్‌జీప్‌వైపు బయలుదేరాడు అప్పలరాజు. ఈ నరహంతకుడిని టీవీ9 సూటిగా ప్రశ్నించింది. పసిబిడ్డను ఎందుకు చంపాల్సి వచ్చిందని నిలదీసింది. సింగిల్‌ లైన్‌లో కంక్లూజన్‌ ఇచ్చాడు

తన బిడ్డను పాడు చేసినందుకే అని అప్పల్రాజు అంటుంటే.. తన ఇంటిని అమ్మలేదనే కక్షతోనే ఆ రాక్షసుడు ఇంత దుర్మార్గానికి పాల్పడ్డాడని అంటున్నాడు విజయ్. అప్పలరాజు కబ్జాలను అడ్డుకున్నందుకే కూతుర్ని అడ్డుపెట్టుకొని తనపై అక్రమ కేసు పెట్టించారన్నారు విజయ్‌. అప్పలరాజు కూతురితో తనకు ఎలాంటి సంబంధంలేదన్నారు విజయ్‌. పక్కా పథకంతో తన కూతురితో చాటింగ్‌ చేయించాడన్నారు. తన భార్య అవహేళన చేసిందనడంలో ఏమాత్రం నిజంలేదని.. తనపై పెట్టిన రేప్‌ కేసు పక్కా ఫాల్స్‌ అని చెప్పాడు.

అప్పలరాజు ఉన్మాదానికి విజయ్‌ కుటుంబం అంతా తుడిచి పెట్టుకుపోయింది. విజయ్‌, పెద్ద కొడుకు మాత్రమే బతికాడు. అమ్మలేదని..ఇక రాదని తల్లడిల్లుతున్న ఆ పిల్లాడి ఆవేదన అంతా ఇంత కాదు. చెల్లి లిషత లేదు.. నాకెవరు రాఖీ కడుతారన్న ఈ పసి మనసు ఆవేదన ప్రతీ ఒక్కర్నీ కన్నీరు పెట్టిస్తోంది.

Also Read: పదే పది రోజులు.. ఆ ఇంట్లో ముగ్గురు మృతి.. కారణాలు వేరైనా గ్రామస్తులను వెంటాడుతున్న కరోనా భయం

సెకండ్ వేవ్ టెర్రర్.. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల అమానుష ఘటనలు.. మరికొన్ని చోట్ల మానవీయ దృశ్యాలు