Juttada murders: విశాఖ నరమేధంలో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. పోలీసుల విచారణలో కొత్త విషయాలు

|

Apr 17, 2021 | 9:22 AM

విశాఖ నరమేధంలో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు బయటపడ్డాయి. పోలీసుల విచారణలో కొత్త విషయాలు వెల్లడించాడు నిందితుడు. విచారణ అనంతరం అప్పలరాజును...

Juttada murders: విశాఖ నరమేధంలో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. పోలీసుల విచారణలో కొత్త విషయాలు
Juttada Murders
Follow us on

విశాఖ నరమేధంలో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు బయటపడ్డాయి. పోలీసుల విచారణలో కొత్త విషయాలు వెల్లడించాడు నిందితుడు. విచారణ అనంతరం అప్పలరాజును 14 రోజుల రిమాండ్‌కు తరలించారు పోలీసులు. చిన్న పిల్లలను కూడా చంపేంత కసి అతడిలో ఎందుకు పెరిగింది..? పాత కక్షలుంటే మాత్రం ఇంత పాశవిక హత్యలా..? అసలు అప్పలరాజు రాక్షసుడిలా ఎందుకు మారాడు…?

ఒక్కడే ఆరుగురినీ అంతమొందించాడు…! కేవలం పావు గంటలోనే నాలుగేళ్ల పగ తీర్చుకున్నాడు. పోలీసుల దర్యాప్తులో అప్పలరాజు చెప్తున్న నిజాలివి. విచక్షణ కోల్పోయి సైకోలా మారిపోయాడు. గేటు దగ్గర మొదలు.. వంటగది వరకూ మారణహోమం సాగింది. పావుగంటలో ఆరుగురిని అంతమొందించాడు. అప్పలరాజును రెండు రోజులు విచారించిన పోలీసులు.. మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. అనంతరం 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. ఇంత చేసినా.. నిందితుడిలో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించలేదు. తన కూతురుకు అన్యాయం జరిగిందనే.. హత్యలు చేశానంటూ చెప్తున్నాడు నిందితుడు.

తొలుత ఇంటి ముందున్న విజయ్ భార్యను.. ఆ తరువాత విజయ్ తండ్రి రమణను హతమార్చాడు నిందితుడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన విజయ్ అత్త, చిన్న అత్తలను కూడా నరికి చంపాడు. తర్వాత గదిలో ఉన్న చిన్న పిలల్లను కూడా కిరాతకంగా చంపేశాడు నిందితుడు. ఆ తర్వాత అరగంట పాటు అక్కడే కూర్చొన్నట్టు పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. హత్యపై పోలీసుకు సమాచారం కూడా అప్పలరాజే ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే, విజయ్‌ తండ్రి, భార్య తనను చూసి వెటకారంగా నవ్వడమే… హత్య చేసేలా చేసిందని నిందితుడు అప్పలరాజు చెప్తున్నాడు.

విశాఖ నరమేధంలో నిందితుడు ఒక్కడేనా.. విజయ్‌ ఆరోపిస్తున్నట్టు ఇంకా ఎవరైనా ఉన్నారా..? అప్పలరాజు ఒక్కడే నిందితుడని అంతా భావిస్తున్నారు. తానే నిందితుడినని అతడు కూడా పోలీసులకు లొంగిపోయాడు. అప్పలరాజు ఒక్కడే హత్య చేసినట్టు పోలీసులూ చెబుతున్నారు. కానీ, హత్యలో ఇంకొందరి సహకారం ఉందని భాదిత కుటుంబానికి చెందిన విజయ్ ఆరోపిస్తున్నాడు. ఈ కేసుతో సంబంధం ఉన్నవారిని అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు. హత్యకు సంబంధం ఉన్నట్టు మరికొందరి పేర్లును కూడా విజయ్‌ ఆరోపిస్తున్నాడు.

ఈ హత్యలకు భూ తగాదాలే కారణమని విజయ్ అంటున్నాడు. తన ఇంటిపక్కన ఉన్న స్థలాన్ని కబ్జా చేస్తే.. అడ్డుకున్నారనే కక్ష అంటున్నాడు. విజయ్‌ ఇంటి పక్కన ఉన్న స్థలం హంతకుడు అప్పలరాజుకు చెందినది. ఎదురుగా ఉన్న ఇల్లు అప్పలరాజు సోదరుడిది. ఈ మధ్యలో విజయ్‌ ఇల్లు ఉండటంతో దాన్ని అమ్మేయాలని పలుమార్లు ఒత్తిడి తెచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. అయినా దాన్ని అమ్మేందుకు విజయ్‌ తండ్రి రమణ నిరాకరించడం, దానికి తోడు వివాహేతర సంబంధం బయటపడటం.. అప్పలరాజులో పగని పెంచింది. దీని వల్లే మారణహోమానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా… పోలీసులు మాత్రం హత్యలకు వివాహేతర సంబంధం కారణమా.. లేక ఆస్తి తగాదాలా..? మరో కారణమేదైనా ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

Also Read: ఏపీలో రెండు నెలల పాటు చేపల వేట బ్యాన్.. మత్స్యకారులకు పది వేల రూపాయల భృతి.. ఆ రోజున ఖాతాల్లోకి డబ్బు

డ్యాన్స్‌ ప్రాక్టీస్‌తో బిజీగా కుందనపు బొమ్మ సునీత.. ఫిమేల్ లీడ్‌గా సినిమాల్లోకి !