Country Made Bomb Blast: కర్నూల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నాటు బాంబు పేలి ఏడో తరగతి విద్యార్థి వర కుమార్ మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. అవుకు మండలం చెన్నంపల్లిలో స్కూల్ పక్కన కొందరు నాటు బాంబులను దాచి ఉంచారు. వాటిని క్రికెట్ బంతులుగా భావించి కుమార్ తీసుకున్నాడు. ఆ బాంబుతో ఆడుకుంటున్న సమయంలో పేలి కుమార్‌కి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే అతడిని కర్నూల్ ప్రభుతాసుపత్రికి తరలించగా.. చికిత్స తీసుకుంటూ కుమార్ మృతి చెందాడు. నాటు బాంబులకు బలైన కుమారుడి మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుమార్ తండ్రి డిమాండ్ చేస్తున్నారు. నాటుబాంబులు ఎవరు పెట్టారు..? ఎందుకోసం ఉంచారు..? ఎక్కడ తయారు చేశారు..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్ధసారధి రెడ్డి స్వగ్రామం చెన్నంపల్లి.
Read More:
రిటైర్ అయ్యే సమయానికి బుమ్రా సూపర్‌స్టార్ అవుతాడు.. గిలెస్పీ ప్రశంసలు