Secret Camera: బెంగళూరులో దారుణం వెలుగు చూసింది. ప్రియుడి సంతోషం కోసం ఓ నర్స్ దారుణానికి ఒడిగట్టింది. ఇతర మహిళలు స్నానం చేస్తున్నప్పుడు తీసిన వీడియోలను ప్రియుడికి పంపించింది. ఎట్టకేలకు అడ్డంగా బుక్కైంది. ఈ ఘటన బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అశ్వని అనే మహిళ నర్సుగా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె ఓ హాస్టల్‌లో ఉంటోంది. అమెకు ప్రియుడు ప్రభు(31) ఉన్నాడు. అతని సంతోషం కోసం.. అదే హాస్టల్‌లో ఉన్న మహిళలు స్నానం చేస్తున్నప్పుడు వీడియోలు తీసి అతనికి పంపించేది. ఈ క్రమంలోనే తాజాగా ఓ సాయంత్రం వేళ ఓ మహిళ హాస్టల్‌లో స్నానానికి వెళ్లింది. ఆ సమయంలో రహస్యంగా ఉంచిన ముబైల్‌ను సదరు మహిళ గుర్తించింది. దాన్ని పరిశీలించగా వీడియో రికార్డ్ అవుతోంది. వెంటనే ఆ ఫోన్ ఓపెన్ చూడగా.. మరికొందరి వీడియోలు కనిపించాయి. దీంతో కంగు తిన్న సదరు మహిళ నేరుగా హాస్టల్ మేనేజర్‌కు సమాచారం ఇచ్చింది. ఆ తరువాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నర్సును, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
Also read:
హెచ్‌సీఏకు మరో ఎదురుదెబ్బ, కొత్త సీజన్‌లో ఆంధ్రా నుంచి బరిలోకి అంబటి..కారణాలు ఇవే
బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ రీచార్జ్ న్యూ ప్లాన్… ప్రైస్ ఎంతో తెలుసా… వ్యాలిడిటీ, డాటా ఎంత వస్తుందంటే…