School bus accident :
హైదరాబాద్ మహానగరంలో టోలిచౌకి బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఓ ప్రైవేటు పాఠశాల బస్సు అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. అతి వేగంగా వచ్చిన ఓ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సు టోలిచౌకి ప్రాంతంలో వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడు వాహనాలను ఢీకొనడంతో, అందులో నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే, బస్సు బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్ల ఈ సంఘటన జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.