అనంతలో కారు బోల్తా ముగ్గురు మృతి.. ఒకరు సీరియస్

ఆంధ్రప్రదేశ్‌లో జాతీయరహదారి రక్తమోడింది. అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

అనంతలో కారు బోల్తా ముగ్గురు మృతి.. ఒకరు సీరియస్

Updated on: Jul 09, 2020 | 9:37 AM

ఆంధ్రప్రదేశ్‌లో జాతీయరహదారి రక్తమోడింది. అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరు నుంచి అనంతపురం వస్తున్న కారు రాప్తాడు మండలంలోని 44వ జాతీయ రహదారిపై గొల్లపల్లి వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో మృతిచెందినవారు బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురం గ్రామానికి చెందినవారుగా గుర్తించినట్లు తెలిపిన పోలీసులు.. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us