యూపీలోని షాజహాన్ పూర్ లో జరిగింది ఈ ఘటన.. 27 ఏళ్ళ క్రితం 12 ఏళ్ళ వయస్సులో ఉన్న బాలికపై ఇద్దరు అన్నదమ్ములు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత తల్లి అయిన ఆమె ఇప్పుడు ఆ నిందితులపై కోర్టుకెక్కింది. ‘ మా బిడ్డ తన తండ్రి ఎవరని అడుగుతున్నాడు.. ఏమని చెప్పను ? నాకు న్యాయం చేయండి’ అని కోర్టును వేడుకుంటోంది. వివరాల్లోకి వెళ్తే.. 27 సంవత్సరాల క్రితం తన అక్కాబావలతో నివసిస్తున్న బాధితురాలిపై అదే ప్రాంతానికి చెందిన నకి హసన్ అనే వ్యక్తి..ఆమె ఒంటరిగా ఉండగా ఆమెపై రేప్ కి పాల్పడ్డాడు. అప్పటికి ఆమె వయస్సు 12 ఏళ్ళు. తన అన్న హసన్ విషయాన్ని తెలుసుకున్న గుడ్డు అనే అతని తమ్ముడు కూడా ఆ బాధితురాలిపై అఘాయిత్యానికి దిగాడు. ఇలా అనేకమార్లు వాళ్ళు ఆమెపట్ల అమానుషంగా ప్రవర్తించారు. తన 13 ఏళ్ళ వయస్సులో ఆమె గర్భం దాల్చింది. 1994 లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తరువాత ఆమె బావకు రామ్ పూర్ బదిలీ కావడంతో ఆమె అక్కడికి వెళ్ళిపోయింది. ఈమెను ఆయన ఘాజీపూర్ జిల్లాకు చెందిన ఓ వ్యకికిచ్చిపెళ్లి చేశాడు.వీరిమధ్య 10 ఏళ్ళ పాటు కాపురం సజావుగానే సాగినా.. తరువాత తన భార్య ఒకప్పుడు రేప్ కి గురైందని తెలుసుకున్నఆమె భర్త ఆమెకు విడాకులిచ్చాడు. దీంతో బాధితురాలు తన బిడ్డను తన అక్కాబావల సంరక్షణలో ఉంచి తన స్వగ్రామానికి చేరుకుంది. ఇప్పుడు పెద్దవాడైన ఆమె కొడుకు తన తల్లి గురించి తెలుసుకున్నాతన తండ్రి గురించి తెలుసుకోలేకపోయాడు . తన తల్లి వద్దకు చేరుకొని తనకు నాన్న ఎవరని అడుగుతుంటే ఆమె సమాధానం చెప్పలేకపోతోంది.
చేసేది లేక తన జీవితాన్ని నాశనం చేసిన ఇద్దరు అన్నదమ్ములపైనా ఫిర్యాదు చేసేందుకు పోలీసుల వద్దకు వెళ్లగా ఆమె ఫిర్యాదును స్వీకరించేందుకు వారు నిరాకరించారు. మరేమీ చేయలేక బాధితురాలు కోర్టుకెక్కింది. కోర్టు ఆదేశాలతో ఇప్పుడు పోలీసులు రంగంలోకి దిగి కేసు దర్యాప్తు మొదలెట్టారు.
మరిన్ని ఇక్కడ చదవండి: