Honey Trap: పాకిస్థాన్ ఏజెంట్‌కు రహస్య ఆర్మీ పత్రాల సరఫరా.. రైల్వే పోస్టల్ డిపార్ట్‌మెంట్ అధికారి అరెస్ట్..!

|

Sep 10, 2021 | 10:33 PM

పాకిస్థాన్ ఏజెంట్‌కు భార‌త సైన్యం ర‌హ‌స్య ప‌త్రాల‌ను సరఫరా చేసిన భార‌తీయ రైల్వే శాఖలో త‌పాలా ఉద్యోగి(27)ని మిలిట‌రీ నిఘా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Honey Trap: పాకిస్థాన్ ఏజెంట్‌కు రహస్య ఆర్మీ పత్రాల సరఫరా.. రైల్వే పోస్టల్ డిపార్ట్‌మెంట్ అధికారి అరెస్ట్..!
Arrest
Follow us on

Honey Trap: పాకిస్థాన్ ఏజెంట్‌కు భార‌త సైన్యం ర‌హ‌స్య ప‌త్రాల‌ను సరఫరా చేసిన భార‌తీయ రైల్వే శాఖలో త‌పాలా ఉద్యోగి(27)ని మిలిట‌రీ నిఘా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి కేసు న‌మోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టామని మిలిట‌రీ నిఘా అధికారులు చెప్పారు.

పాకిస్తాన్ ఏజెంట్‌కు భారత సైన్యం రహస్య పత్రాలను సరఫరా చేశాడనే ఆరోపణతో రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన 27 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగిని అరెస్ట్ చేశామని ఇండియన్ ఆర్మీ నిఘా వర్గాలు తెలిపాయి. స‌ద‌రు వ్యక్తిని భార‌తీయ రైల్వేలోని జైపూర్ త‌పాలాశాఖాధికారిగా భార‌త్ బావ్రి అని గుర్తించారు. గోదారా జైపూర్ రైల్వే స్టేషన్ సమీపంలోని పోస్టాఫీసులో అసిస్టెంట్‌గా పనిచేశారు. గత ఆరు నెలలుగా ISI కి జాతీయ ప్రాముఖ్యతకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలను విక్రయిస్తున్నారని అధికారుల విచారణలో తేలింది. అత‌డు హానీట్రాప్‌లో చిక్కుకున్నార‌ని తేలింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా స‌ద‌రు ర‌హ‌స్య ప‌త్రాల‌ను అంద‌జేస్తామ‌ని పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకి ఇచ్చిన స‌మాచారం ఆధారంగా మిలిట‌రీ నిఘా అధికారులు గుర్తించారు.

ఆరు నెల‌ల క్రితం ఆయ‌న‌కు ఓ మెసేజ్ వ‌చ్చింది. పాకిస్తాన్ గూఢచారి ఏజెన్సీ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) మ‌హిళా ఏజెంట్ తాను ఎంబీబీఎస్ విద్యార్థిన‌ని, పోర్ట్ బ్లయ‌ర్‌లో చ‌దువుతాన‌ని ఫేస్‌బుక్ ద్వారా ప‌రిచ‌యం చేసుకుంది. ఇది నిజమేనని నమ్మిన అధికారి.. ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. అటుపై వాట్సాప్ వాయిస్‌, వీడియో కాల్స్‌తో మాట్లాడుకునే వరకు వెళ్లింది. త‌న బంధువులు ఆర్మీలో ఉన్నార‌ని స‌ద‌రు మ‌హిళ న‌మ్మ బ‌లికింద‌ని ద‌ర్యాప్తు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫ్ సదరన్ కమాండ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ, స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ రాజస్థాన్ సంయుక్తంగా నిర్వహించిన దర్యాప్తులో నిందితుడి పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.

కాగా, నిందితుడి ఫోన్ వాస్తవ విచారణలో వాస్తవాలను నిర్ధారించిన తరువాత, అధికారిక రహస్యాల చట్టం, 1923 కింద నిందితులపై కేసు నమోదు చేసినట్లు మిలటరీ అధికారులు తెలిపారు.

Read Also.. Edible Oils: వంట నూనెల ధరలు తగ్గించడానికి ప్రభుత్వ చర్యలు..ఇకపై వ్యాపారులు అలా చేయాల్సిందే!