
Bangalore ATM Decoy Case : ఏడేళ్లక్రితం బెంగళూరు ఏటీఎంలో డెకాయిట్. ఎవరూ మరిచిపోలేదా దృశ్యం. ఉదయాన్నే ఏటీఎంకి వెళ్లిన ఒంటరి మహిళపై కత్తిదూశాడో దుండగుడు. చనిపోయిందని షట్టర్ దించేసి వెళ్లిపోయాడు. ఆ దోపిడీ కేసులో నిందితుడైన చిత్తూరువాసి నేరం రుజువైంది. కోర్టు శిక్ష ఖరారు చేయబోతోంది.
ఏటీఎం క్రైమ్‌లో అదో కొత్త కోణం. పట్టపగలు ఏటీఎంలో నగదు డ్రాచేసుకునేందుకు వెళ్లిన మహిళపై కత్తితో పాశవికంగా దాడిచేశాడో దుండగుడు. వదిలేయమని ప్రాథేయపడ్డా కనికరించలేదు. తీవ్రగాయాలపాలై స్పృహకోల్పోయినా..అదృష్టవశాత్తూ అప్పట్లో ప్రాణాలతో బయటపడింది బాధితురాలు.
పేరు జ్యోతి, తనో బ్యాంక్ ఉద్యోగిని. 2013 నవంబరు 19న బెంగళూరు నడిబొడ్డున ఉన్న ఏటీఎంలో జరిగిందీ దోపిడీ. మహిళ ఒంటరిగా ఏటీఎంలో ఉండటం చూసి లోపలికి చొరబడ్డాడు దుండగుడు. తప్పించుకునే అవకాశం లేకుండా షట్టర్ దించేశాడు. ప్రతిఘించిన జ్యోతిపై కత్తితో దాడిచేశాడు. కూతురి బర్త్‌డే కోసం డబ్బు డ్రాచేసేందుకు ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో..జ్యోతి అనే మహిళ ఏటీఎంకి వెళ్లినప్పుడు జరిగిందీ ఘటన.
సీసీ ఫుటేజీ ఆధారంగా చివరికి పోలీసులు నిందితుడిని గుర్తించారు. నేరానికి పాల్పడ్డ చిత్తూరుజిల్లా దివుపల్లి గ్రామానికి చెందిన కొండప్పగిరి మధుకర్‌రెడ్డిని పట్టుకున్నారు. ఐపీసీ 397, 201 సెక్షన్ల కింద నిందితుడిపై అభియోగాలు రుజువయ్యాయి. నిందితుడికి శిక్ష ఖరారు చేయబోతోంది బెంగళూరు 64వ సిటీ సివిల్ సెషన్స్ కోర్టు.
ఇవి కూడా చదవండి :
Pete Buttigieg : అమెరికా కేబినెట్‌లోకి తొలి ట్రాన్స్‌జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్..
Naadu Nedu Second Phase : మనబడి ‘నాడు- నేడు’పై సీఎం జగన్ సమీక్ష.. రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు..