ఆమెనే ఆత్మహత్యాయత్నం చేసుకుంది..!

విశాఖలో సంచలనం రేపిన కావ్య కేసులో పురోగతి సాధించారు పోలీసులు. పెట్రోల్ పోసుకుని కావ్యే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు నిర్దారించారు. ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమని తేల్చారు. ఆంబులెన్స్ డ్రైవర్ నరేంద్రను కావ్య ప్రేమించినట్లు.. అతను పెళ్లికి నిరాకరించడంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు బయటపడింది. నరేంద్రకు ఇప్పటికే పెళ్లయి ముగ్గురు పిల్లలున్నారు. కావ్య ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తోంది. కాగా.. నిన్న శివాజీ పాలెం రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఉన్నట్లుండి కావ్య ఒంటికి మంటలు […]

ఆమెనే ఆత్మహత్యాయత్నం చేసుకుంది..!
Follow us

| Edited By:

Updated on: Jul 04, 2019 | 11:14 AM

విశాఖలో సంచలనం రేపిన కావ్య కేసులో పురోగతి సాధించారు పోలీసులు. పెట్రోల్ పోసుకుని కావ్యే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు నిర్దారించారు. ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమని తేల్చారు. ఆంబులెన్స్ డ్రైవర్ నరేంద్రను కావ్య ప్రేమించినట్లు.. అతను పెళ్లికి నిరాకరించడంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు బయటపడింది. నరేంద్రకు ఇప్పటికే పెళ్లయి ముగ్గురు పిల్లలున్నారు. కావ్య ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తోంది.

కాగా.. నిన్న శివాజీ పాలెం రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఉన్నట్లుండి కావ్య ఒంటికి మంటలు అంటుకున్నాయి. హాహాకారాలు చేయడంతో స్థానికులు మంటలు ఆర్పివేసి వెంటనే ఆస్పత్రికి తరలించారు. 60 శాతం కాలిన గాయాలతో ఉన్న కావ్యను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అయితే.. తన డ్రెస్‌పై కిరోసిన్ పడిందని.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా పక్కనే కాలుతున్న చెత్తకుప్పలోంచి మెరుగులు వచ్చి ఒంటిపై పడటం వల్లే మంటలు అంటుకున్నాయని చెప్పింది.

Latest Articles