Telangana: ఉస్మానియా యూనివర్సిటీ ఫేక్ సర్కులర్ కేసులో పోలీసుల దూకుడు.. బీఆర్ఎస్ కీలక నేత అరెస్ట్!

బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అరెస్ట్ అయ్యారు. ఫేక్ సర్క్యులర్‌ను సర్క్యులేట్ చేసిన కేసులో బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు మేరకు అతడిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.

Telangana: ఉస్మానియా యూనివర్సిటీ ఫేక్ సర్కులర్ కేసులో పోలీసుల దూకుడు.. బీఆర్ఎస్ కీలక నేత అరెస్ట్!
Krishank Arrest
Follow us

|

Updated on: May 02, 2024 | 7:54 AM

బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అరెస్ట్ అయ్యారు. ఫేక్ సర్క్యులర్‌ను సర్క్యులేట్ చేసిన కేసులో బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు మేరకు అతడిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.

బీఆర్ఎస్‌ నేత క్రిశాంక్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కొత్తగూడెం నుంచి హైదరాబాద్‌కి వస్తుండగా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా దగ్గర అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా విభాగం ఫిర్యాదుతో ఓయూ పోలీస్‌స్టేషన్‌లో క్రిశాంక్‌పై కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్ల 466, 468, 469, 505(1) కింద క్రిశాంక్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓయూ పేరుతో ఫేక్‌ సర్క్యులర్‌ను సోషల్‌ మీడియాలో క్రిశాంక్‌ అప్‌లోడ్‌ చేశారని ఫిర్యాదు చేసింది కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా విభాగం.

గత ఏడాది ఓయూ వేసవి సెలవులకు సంబంధించి.. ఫేక్ ​సర్క్యూలర్​ను సోషల్​ మీడియాలో బీఆర్‌ఎస్‌ పోస్ట్‌ చేసిందన్నారు ఓయూ చీఫ్‌ వార్డెన్‌. ఫేక్‌ నోటీసును సృష్టించిన బీఆర్ఎస్​ నాయకుడు మన్నె క్రిశాంక్‌పై ఓయూ అధికారులు వర్సిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తాము జారీ చేసిన సర్క్యూలర్​‌కు బదులు ఫేక్​ సర్క్కూలర్‌​ను తయారు చేసి సోషల్‌ మీ​మీడియాలో పెట్టి వర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు వార్తను ప్రచారం చేసిన క్రిశాంక్‌​పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఓయూ చీఫ్​ వార్డెన్ శ్రీనివాస్​ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో క్రిశాంక్​ పెట్టిన సర్క్యూలర్‌​పై సర్క్కూలర్​ నంబర్​ కూడా పెన్నుతో రాసి ఉందని, తన సంతకాన్ని కూడా కాపీ చేశాడని ఆయన పేర్కొన్నారు. వార్డెన్ ఫిర్యాదు మేరకు క్రిశాంక్‌​పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

ఫైనల్‌గా ఓయూ సెలవులపై దుమారం రేగడంతో యూనివర్సిటీలో వేసవి సెలవులు రద్దయ్యాయి. సోమవారం ప్రకటించిన వేసవి సెలవులను రద్దు చేస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ వెల్లడించారు. హాస్టల్స్, మెస్​లు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డీఎస్సీ తదితర పోటీ పరీక్షలకు ప్రిపేర్​అవుతున్న విద్యార్థుల విజ్ఞప్తి మేరకు సెలవులను రద్దు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.వర్సిటీ అధికారుల నిర్ణయంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

ఇదిలావుంటే, క్రిశాంక్ అరెస్ట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సోషల్ మీడియా వేదిక ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. క్రిషాంక్ అరెస్టు.. అక్రమం, అన్యాయం, దుర్మార్గమంటూ విరుచుకుపడ్డారు. క్రిశాంక్ అంటే ఒక ఉద్యమ గొంతుక, ఒక చైతన్య ప్రతీక, యువతరానికి ప్రతిబింబమన్నారు. గల్లీ కాంగ్రెస్ వైఫల్యాలపై, ఢిల్లీ బీజేపీ అరాచకాలపై గళమెత్తినందుకేనా ఈ దౌర్జన్యం, ప్రశ్నించినందుకే ఈ దుర్మార్గమని మండిపడ్డారు. కాంగ్రెస్-బీజేపీ కలిసి చేస్తున్న ఈ కక్ష సాధింపులకు.. మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. తెలంగాణ ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చారు. నాడు ఎమర్జెన్సీ చూశాం..నేడు అప్రకటిత ఎమర్జెన్సీ చూస్తున్నామని ఫైర్ అయ్యారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
రోహిత్, నమన్‌ల పోరాటం వృథా.. లక్నో చేతిలో ముంబైకు తప్పని ఓటమి
రోహిత్, నమన్‌ల పోరాటం వృథా.. లక్నో చేతిలో ముంబైకు తప్పని ఓటమి
'పవిత్ర నన్ను పిలుస్తోంది'.. 'త్రినయని' సీరియల్ నటుడు చందు సూసైడ్
'పవిత్ర నన్ను పిలుస్తోంది'.. 'త్రినయని' సీరియల్ నటుడు చందు సూసైడ్
'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్
'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్
చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!
చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!
నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!
పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!
చేపల కోసం వల విసిరిన జాలరి.. ఏం చిక్కిందో చూసి షాక్
చేపల కోసం వల విసిరిన జాలరి.. ఏం చిక్కిందో చూసి షాక్
175 మందితో ప్రయాణిస్తున్న విమానం..ఒక్కసారిగా మోగిన ఎమర్జెన్సీబెల్
175 మందితో ప్రయాణిస్తున్న విమానం..ఒక్కసారిగా మోగిన ఎమర్జెన్సీబెల్
నేషనల్ హైవే ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్
నేషనల్ హైవే ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్
టీమిండియా కోచ్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్.. విదేశీయులకు నో ఛాన్స్
టీమిండియా కోచ్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్.. విదేశీయులకు నో ఛాన్స్