విశాఖ ఏజెన్సీలో పోలీసుల తనిఖీలు.. లారీలో అక్రమంగా తరలిస్తున్న రూ. కోటి విలువైన గంజాయి పట్టివేత

గంజాయి అక్రమ దందాకు అడ్డులేకుండాపోతుంది. లారీలో ప్రత్యేకంగా తయారు చేయించిన క్యాబిన్‌లో గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

విశాఖ ఏజెన్సీలో పోలీసుల తనిఖీలు.. లారీలో అక్రమంగా తరలిస్తున్న రూ. కోటి విలువైన గంజాయి పట్టివేత

Updated on: Dec 11, 2020 | 6:58 AM

గంజాయి అక్రమ దందాకు అడ్డులేకుండాపోతుంది. లారీలో ప్రత్యేకంగా తయారు చేయించిన క్యాబిన్‌లో గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కంటైనర్‌ లారీలో అక్రమంగా తరలిస్తున్న రూ.కోటి విలువైన గంజాయిని విశాఖపట్నం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ ఏజెన్సీ పాడేరులో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. లారీలో గంజాయి ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. లారీకి ప్రత్యేకంగా అరను అమర్చి గంజాయిని తరలించేస్తున్నారు. కంటైనర్‌లో 870 కేజీల గంజాయి పట్టుబడిందని, మార్కెట్‌లో దీని విలువ రూ. కోటి వరకు ఉంటుందని విశాఖ పోలీసులు తెలిపారు. బీహార్ రాష్ట్రాలకు చెందిన స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. సరిహద్దులో తనిఖీలను ముమ్మరం చేశామని, నిషేధిత వస్తువులు తరలిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖ పోలీసులు హెచ్చరించిస్తున్నారు.