NIA: షరియా లక్ష్యం.. ఆన్‌లైన్ ద్వారా భావజాల విస్తరణ. ఇస్లామిక్ స్టేట్ వ్యాప్తిపై NIA కీలక ప్రకటన

|

Sep 17, 2021 | 7:48 PM

ఇస్లామిక్ స్టేట్. ఈ పేరు వింటే ఇప్పుడు యావత్ దేశం ఉలిక్కిపడుతోంది. చాపకింద నీరులా తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. అందుబాటులోకి వచ్చిన

NIA: షరియా లక్ష్యం.. ఆన్‌లైన్ ద్వారా భావజాల విస్తరణ. ఇస్లామిక్ స్టేట్ వ్యాప్తిపై NIA కీలక ప్రకటన
Follow us on

Islamic State: ఇస్లామిక్ స్టేట్. ఈ పేరు వింటే ఇప్పుడు యావత్ దేశం ఉలిక్కిపడుతోంది. చాపకింద నీరులా తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. అందుబాటులోకి వచ్చిన ఆన్‌లైన్ మీడియాను ఉపయోగించుకుంటున్న ISIS తన పరిధిని విస్తరించుకునే పనిలో పడింది. ఉగ్రవాద సంస్థ మూలాలు, కదలికలపై డీటేల్డ్ అధ్యయనం చేసిన NIA షాకింగ్ రిపోర్ట్ అందించింది.

ఇస్లామిక్ స్టేట్ భావజాలంతో జరిగిన దాడులు, కుట్రలు, నిధులు.. మొత్తం 37 కేసులు దర్యాప్తు చేసినట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తాజాగా ప్రకటించింది. ఐఎస్ఐఎస్ దేశంలో విస్తరించాలని చూస్తోందని తమ దర్యాప్తులో తేలినట్లు ప్రకటించింది. ఆన్‌లైన్ మాధ్యమాల ద్వారా తమ భావజాలాన్ని విస్తరించాలని చూస్తున్నట్లు NIA ప్రకటించింది.

నిన్న తమిళనాడులో జరిపిన దాడుల్లో మధురైలో ఓ వ్యక్తిని అరెస్టు చేశారు NIA అధికారులు. అతన్ని హిజ్బ్-ఉత్-తాహ్రిర్‌గా గుర్తించారు. ఇస్లామిక్ స్టేట్‌ను దేశంలో నెలకొల్పి, షరియాను భారత్ సహా ప్రపంచమంతా నెలకొల్పాలన్న లక్ష్యంతో కుట్రలు జరుగుతున్నట్లు NIA ప్రకటించింది.

ఇస్లామిక్ స్టేట్ గురించి ఏ సమాచారం తెలిసినా చెప్పాలని ప్రజలకు సూచించింది NIA. హాట్‌లైన్ నెంబర్ 011-24368800 కు ఫోన్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. ISIS కదలికలపై కన్నేసిన NIA కూపీ లాగేందుకు యత్నిస్తోంది. దేశ వ్యాప్తంగా కీలక సమాచారం రాబోడుతోంది. ఇప్పటి వరకూ ఈ నెట్ వర్క్ కు సంబంధించి 168 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Read also: సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి సీజేఐ ఎన్వీ రమణను ఆహ్వానించిన చిన్నజీయర్ స్వామి