Crime News: పెళ్లైన పదహారు రోజులకే నవ వధువు అనుమానాస్పద మృతి.. పోలీసుల ఎంట్రీతో వెలుగులోకి సంచలనాలు!

ప్రభుత్వ చట్టాలు ఎన్ని వచ్చిన అబలకు బలం చేకూర్చలేకపోతున్నాయి. వరకట్న దాహానికి మరో నవ వధువు ప్రాణాలు కోల్పోయింది

Crime News: పెళ్లైన పదహారు రోజులకే నవ వధువు అనుమానాస్పద మృతి.. పోలీసుల ఎంట్రీతో వెలుగులోకి సంచలనాలు!
Death

Updated on: Nov 16, 2021 | 10:59 AM

 Bride Suspected Death: ప్రభుత్వ చట్టాలు ఎన్ని వచ్చిన అబలకు బలం చేకూర్చలేకపోతున్నాయి. వరకట్న దాహానికి మరో నవ వధువు ప్రాణాలు కోల్పోయింది. భర్త, అత్తామామ వేధింపులు భరించలేక నవ వధువు అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది.ఈ ఘటన గుంటూరు రూరల్ మండలం పొత్తూరులో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పొత్తూరు గ్రామానికి చెందిన గోపాల కృష్ణారెడ్డితో స్వప్న శ్రీకి పదహారు రోజుల క్రితం వివాహం జరిగింది. పెళ్లి సందర్భంగా అన్ని లాంఛనలతో పుట్టింటి వారు ఘనంగా వివాహం జరిపించారు. అయితే, సోమవారం కొత్త పెళ్లి కూతురు స్వప్న శ్రీ అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఆమె చనిపోయిన విషయాన్ని అలస్యంగా ఆమె కుటుంబసభ్యులకు అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న కుటుంబసభ్యులు స్వప్నశ్రీ మృతి పట్ల అనుమానం వ్యక్తం చేశారు. భర్త, అత్తమామలే అదనపు కట్నం కోసం కొట్టి చంపారంటూ బంధువుల ఆరోపించారు. అమేరకు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నల్లపాడు పోలీస్ స్టేషన్ లో స్వప్ప శ్రీ కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహన్ని పోస్టుమార్టానికి పంపి విచారణ చేపట్టారు.