చదువంటే ఆమెకు ఇష్టం. నిరుపేద నేపథ్యమైనా పాఠశాలలో మాత్రం చదువుల తల్లే. పెద్ద ఉద్యోగం సంపాదించి, అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలన్న ఆ చిట్టి తల్లి జీవితం, 15ఏళ్లకే ముగిసిపోయింది. నెరేడిమెట్ లోని రవింద్ర భారతీ స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న యశస్వినికి స్కూల్ సిబ్బంది ఫీజు కొరకు వేధించడంతో తీవ్ర మనస్తాపనికి గురై యశస్విని ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకొని అత్మహత్యకు పాల్పడింది. లాక్‌డౌన్ తర్వాత స్కూల్ ప్రారంభం కావడంతో రోజూ స్కూల్‌కు వెళ్తోంది యశస్విని. ఫీజు మొత్తం చెల్లించేయాలని విద్యార్థిని తండ్రితో పాటు యశస్వినికి కూడా పాఠశాల యాజమాన్యం తెలిపింది.
కరోనా కారణంగా పనులు నిలిచిపోవడంతో ఆర్థికంగా కొంత ఇబ్బందిగా ఉందని, కాస్త ఆలస్యమైనా, కచ్చితంగా కట్టేస్తామని యశస్విని తండ్రి హరిప్రసాద్ స్కూల్ యాజమాన్యాన్ని బతిమాలారు. అయనాకాని స్కూల్ సిబ్బంది ఫీజు కడితేకాని స్కూల్ కు రావద్దని తెల్చి చెప్పడంతో తీవ్ర మనస్తాపనికి గురై బాలిక అత్మహత్యకు పాల్పడింది. చిన్నారి మృతికి కారణమైన స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్ధి సంఘలు, పేరెంట్స్ స్కూల్ ఎదుట అందోళన చేశారు.
స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు పాఠశాల దగ్గరకు చేరుకొని దగ్గరుండి స్కూల్ ను సీజ్ చేయించారు. ప్రభుత్వం తరుఫున చిన్నారి కుటుంబానికి అండగా ఉంటామని ఆయన భరోసానిచ్చారు. ఓ వైపు లాక్ డౌన్ తో ఉపాధి లేక తల్లి తండ్రులు ఇబ్బందులు పడుతుంటే ప్రైవేట్ స్కూల్స్ దొపిడికి పాల్పడుతున్నాయని ఎమ్మెల్యే మండిపడ్డారు. ఇటువంటి ఘటనలు పునరవృతం కాకుండా ఉండాలంటే ఈ ఏడాది ఫిజులను మాఫీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే హన్మంత్ రావు.. మంత్రి కేటీఆర్ కు ఫోన్ చేసి కోరారు.
Read also : ఏపీలో రేపే మూడో విడత పంచాయతీ ఎన్నికల పోరు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఇలాకాలో ఏకగ్రీవాల జోరు