Nellore District: ఓ వైపు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది. మహమ్మారి కరోనా వ్యాక్సిన్(Corona Vaccine) కనిపెట్టాం, ఆకాశంలో అద్భుతాలు చేస్తున్నాం… కానీ.. మూఢనమ్మకాలకు ముగింపు పలకలేకపోతున్నాం. తాజాగా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం(Buchireddypalem Mandal)లో క్షుద్రపూజలు కలకలం రేపింది. మండలంలోని ప్రసిద్ధ జొన్నవాడ క్షేత్రం దగ్గర క్షుద్ర పూజలతో స్థానికులు హడలెత్తిపోయారు. జొన్నవాడ గ్రామ సమీపంలోని పెన్నా నది జరిగిన విచిత్ర పూజలు గ్రామస్తులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గ్రామం నుంచి పెన్నానదికి వెళ్లే మార్గంలో రహదారిపై ముగ్గుతో మనిషి బొమ్మవేసి, అందులో నిమ్మకాయలు, పసుపు, కుంకుమ చల్లి గుర్తు తెలియని వ్యక్తులు పూజలు చేశారు. గత కొంతకాలంగా అమావాస్య, పౌర్ణమికి ఈ ప్రాంతంలో తరచుగా ఇలాంటి భయానక పూజలు చేస్తుండటంతో ఆ మార్గంలో వెళ్లాలంటేనే స్థానికులు భయపడిపోతున్నారు. ఇంటి సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు. అధికారులకు తాంత్రికపూజల విషయం చెబితే మూఢనమ్మకాలని కొట్టిపారేస్తున్నారని వాపోతున్నారు. కాగా క్షుద్ర పూజల పేరిట ఎవరైనా మాయమాటలు చెప్పడానికి ప్రయత్నిస్తే నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Also Read: ఉపాధినిస్తుంది అనుకున్న వృత్తి ఉసురు తీసింది.. చేప దాడిలో మత్యకారుడు మరణం
సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన వినూత్నమైన పడవ.. అనుమానంతో మత్స్యకారులు చెక్ చేయగా…