రూ.150 ఎంతపని చేసింది..!

| Edited By: Pardhasaradhi Peri

May 18, 2020 | 6:30 PM

మనీ కోసం మానవత్వాన్నే కొల్పోతున్నారు. క్షణికావేశంలో స్నేహితుడినే హతమార్చాడు ఓ యువకుడ. ఆర్థిక రాజధాని ముంబైలో ఈ ఘటన చోటుచేసుకుంది. దక్షిణ ముంబైకి చెందిన భూషణ్ షేక్ అలియాస్ చుల్‌బుల్‌, రియాజ్‌ షేక్‌(23) ఇద్దరు స్నేహితులు. భౌచా దక్కా చేపల మార్కెట్‌లో దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌కి ముందు చుల్‌బుల్‌ నుంచి రియాజ్‌ రూ.150 అప్పుగా తీసుకున్నాడు. గత శనివారం తన డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా రియాజ్ పై ఒత్తిడి తీసుకువచ్చాడు చుల్‌బుల్‌. దీంతో ఇద్దరి మధ్య […]

రూ.150 ఎంతపని చేసింది..!
Follow us on

మనీ కోసం మానవత్వాన్నే కొల్పోతున్నారు. క్షణికావేశంలో స్నేహితుడినే హతమార్చాడు ఓ యువకుడ. ఆర్థిక రాజధాని ముంబైలో ఈ ఘటన చోటుచేసుకుంది.
దక్షిణ ముంబైకి చెందిన భూషణ్ షేక్ అలియాస్ చుల్‌బుల్‌, రియాజ్‌ షేక్‌(23) ఇద్దరు స్నేహితులు. భౌచా దక్కా చేపల మార్కెట్‌లో దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌కి ముందు చుల్‌బుల్‌ నుంచి రియాజ్‌ రూ.150 అప్పుగా తీసుకున్నాడు. గత శనివారం తన డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా రియాజ్ పై ఒత్తిడి తీసుకువచ్చాడు చుల్‌బుల్‌. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంలో కోపోద్రిక్తుడైన చుల్‌బుల్‌ బడ్డరాయితో రియాజ్‌ తలపై బలంగా మోది పారిపోయాడు. రక్తపు మడుగులో పడిపోయిన రియాజ్‌ను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. రియాజ్‌ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చుల్‌బుల్‌ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.