Mumbai Crime : ఇళ్లు చూస్తానంటే తీసుకెళ్లినందుకు ఓ డాక్టర్ ఏకంగా గర్ల్‌ఫ్రెండ్ ఇంటికే కన్నం వేశాడు. వాళ్ల పూర్వీకుల ఆభరణాలను తస్కరించాడు. వాళ్లు తేరుకునే సమయానికి ఉడాయించాడు. నిందితుడిని పన్వెల్ నివాసి 35 ఏళ్ల సౌరభ్ ఠాకూర్‌గా గుర్తించారు. ఎట్టకేలకు ఠాకూర్‌ను ఘాట్‌కోపర్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు తెలియజేశారు. ఐటీ ప్రొఫెషనల్‌గా పని చేస్తున్న 32 ఏళ్ల మహిళకు ఓ డేటింగ్ యాప్‌లో ఠాకూర్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. వారి ప్రొఫైల్స్ సరిపోలడంతో, ఇద్దరూ చాటింగ్ ప్రారంభించారు. నిందితుడు ఒకసారి తన తల్లిదండ్రులను కలవాలని ఆమెను కోరాడు. అయితే ఆ మహిళ అతడిని ఘాట్కోపర్ లోని తన ఇంటికి తీసుకెళ్లింది. ఆ వ్యక్తి ఇంటికి చేరుకున్న కొద్ది సేపటికి కారులో బహుమతిని మరచిపోయానని వెళ్లి మళ్లీ కనిపించలేదు.
నాలుగు రోజుల తరువాత, తన తల్లి పూర్వీకుల ఆభరణాలు ఇంట్లో కనిపించడం లేదని గ్రహించింది. బంగారు ఆభరణాలు దొంగిలించారని అనుమానించింది. అయితే ఇంటికి సౌరభ్ ఠాకూర్ తప్ప, ఎవరూ సందర్శించలేదు. ఆ తర్వాత అతడు కనిపించలేదు. దీంతో అతడితో తిరిగిన ఆ మహిళ దొంగతనం జరిగిందని నిర్దారించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆ డాక్టర్ 6.5 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను దొంగిలించినట్లు ప్రాథమిక పోలీసుల దర్యాప్తులో తేలింది. అతను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) తో ఎండోక్రినాలజిస్ట్ అని జాబ్ ఓరియెంటెడ్ వెబ్‌సైట్‌లో ఓ వ్యక్తి ప్రొఫైల్ చెబుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల ప్రొఫైల్ సమాచారం వాస్తవమైనదా కాదా అని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు.