గోద్రా సమీపంలో పాల్‌ఘర్‌ సీన్‌ రిపీట్.. కానీ ఇక్కడ మాత్రం..

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన పాల్‌ఘర్‌ మూకదాడి గురించి చర్చ కొనసాగుతున్న క్రమంలోనే గుజరాత్‌లో కూడా ఇలాంటి సీన్‌ ఒకటి రిపీట్‌ అయ్యింది. అయితే ఇక్కడ మాత్రం బాధితులు ప్రాణాలతో బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే..గుజరాత్‌లోని పంచమహల్స్‌లో మూకదాడి చోటుచేసుకుంది. ఇందుకు కారణం దొంగలు సంచరిస్తున్నారన్న పుకార్లేనని తేలింది. ఓ వాహనంలో వెళ్తోన్న ముగ్గురు వ్యక్తుల్ని.. దొంగలుగా భావించి.. గిరిజనులు దాడికి దిగారు. అయితే ఈ ఘటనలో వాహనంలో ఉన్న వారు తీవ్రంగా గాయపడ్డారు కానీ ప్రాణాపాయం లేదని […]

గోద్రా సమీపంలో పాల్‌ఘర్‌ సీన్‌ రిపీట్.. కానీ ఇక్కడ మాత్రం..

Edited By:

Updated on: Apr 21, 2020 | 7:59 PM

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన పాల్‌ఘర్‌ మూకదాడి గురించి చర్చ కొనసాగుతున్న క్రమంలోనే గుజరాత్‌లో కూడా ఇలాంటి సీన్‌ ఒకటి రిపీట్‌ అయ్యింది. అయితే ఇక్కడ మాత్రం బాధితులు ప్రాణాలతో బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే..గుజరాత్‌లోని పంచమహల్స్‌లో మూకదాడి చోటుచేసుకుంది. ఇందుకు కారణం దొంగలు సంచరిస్తున్నారన్న పుకార్లేనని తేలింది. ఓ వాహనంలో వెళ్తోన్న ముగ్గురు వ్యక్తుల్ని.. దొంగలుగా భావించి.. గిరిజనులు దాడికి దిగారు. అయితే ఈ ఘటనలో వాహనంలో ఉన్న వారు తీవ్రంగా గాయపడ్డారు కానీ ప్రాణాపాయం లేదని తెలుస్తోంది. గోద్రా మండలంలో దొంగలు సంచరిస్తున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో స్థానికంగా గిరిజన ప్రాంతాల్లో కూడా ఈ వార్త వైరల్ అయ్యింది. దీంతో దహోడ్ ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు.. గోద్రా ప్రాంతాం మీదుగా వెహికిల్‌లో వెళ్తుండగా.. వీరిని దొంగలుగా భావించి అక్కడి గ్రామస్ధులు దాడికి పాల్పడ్డారు.

తొలుత వారిని గ్రామస్ధులు ఆపి.. ప్రశ్రించారు. అయితే వారి వద్ద నుంచి సరైన సమాదానం రాకపోవడంతో దొంగలుగా భావించి దాడికి పాల్పడ్డారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని.. ఆ ముగ్గురు వ్యక్తుల్ని రక్షించారు. ఘటనపై కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

కాగా.. మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌లోవాహనంలో వెళ్తోన్న ఇద్దరు సాదువులు, అతడి డ్రైవర్‌ను దొంగలన్న నెపంతో గ్రామస్ధులు మూకదాడికి దిగారు. పోలీసులు వచ్చినా కూడా పోలీసులను లెక్క చేయకుండా సాధువులపై నిర్ధాక్షిణ్యంగా దాడికి దిగి ప్రాణాలు తీశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పాల్‌ఘర్ పోలీసులు 110 మందిని అరెస్ట్ చేశారు.