అసలు ఆమె ఆటోలో ఎందుకు వెళ్లింది? రోహిత మిస్సింగ్ మిస్టరీ

| Edited By:

Jan 09, 2020 | 4:38 PM

రోహిత మిస్‌ అయి ఇప్పటికి 15 రోజులు అయ్యింది. అయినా ఇప్పటికీ ఆ కేసు మిస్టరీగానే ఉంది. ఎంతో కఠినమైన కేసులను ఛేదించిన పోలీసులు.. రోహిత జాడని మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. అసలు ఆమె ఆరోజు ఆటో ఎందుకు ఎక్కింది? పోలీసులు అన్‌ లాక్ చేసిన.. రోహిత ఫోన్‌లో ఏమైనా క్లూస్ దొరికాయా? ఇప్పటికీ ఆమె కేసు మిస్టరీగానే మారిపోయింది. గచ్చిబౌలిలోని మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రోహిత అదృశ్యమయి ఇప్పటికి ఏకంగా 15 రోజులు గడిచాయి. ఇన్ని రోజులైనా […]

అసలు ఆమె ఆటోలో ఎందుకు వెళ్లింది? రోహిత మిస్సింగ్ మిస్టరీ
Follow us on

రోహిత మిస్‌ అయి ఇప్పటికి 15 రోజులు అయ్యింది. అయినా ఇప్పటికీ ఆ కేసు మిస్టరీగానే ఉంది. ఎంతో కఠినమైన కేసులను ఛేదించిన పోలీసులు.. రోహిత జాడని మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. అసలు ఆమె ఆరోజు ఆటో ఎందుకు ఎక్కింది? పోలీసులు అన్‌ లాక్ చేసిన.. రోహిత ఫోన్‌లో ఏమైనా క్లూస్ దొరికాయా? ఇప్పటికీ ఆమె కేసు మిస్టరీగానే మారిపోయింది.

గచ్చిబౌలిలోని మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రోహిత అదృశ్యమయి ఇప్పటికి ఏకంగా 15 రోజులు గడిచాయి. ఇన్ని రోజులైనా ఆమె ఆచూకీ ఇంకా లభించలేదు. దీంతో.. కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. రోహిత ఫోన్‌ను పోలీసులు రెండురోజుల క్రితం అన్‌ లాక్ చేశారు. దాని నుంచి కీలక సమాచారం సేకరించామని చెప్పారు. అయితే అందులో ఏముందనేది మాత్రం బయటకు చెప్పలేదు. రోహిత ఆచూకీని కనుగొనేందుకు పోలీసులు ఐదు బృందాలను ఏర్పాటు చేసి రెక్కీ నిర్వహిస్తున్నారు. అటు రోహిత కుటుంబ సభ్యులు కూడా.. ఆమె ఆచూకీ కోసం వెతుకుతున్నారు.

కాగా.. హైదరాబాద్ ఆపిల్ ఇండియా ఉద్యోగి అయిన 34 ఏళ్ల రోహిత 2019 డిసెంబర్ 26 నుంచి కనిపించకుండాపోయింది. గచ్చిబౌలిలో సెలెస్టా అపార్టు‌మెంట్‌లో రోహిత ఇద్దరు స్నేహితులతో కలిసి ఉండేది. రోహిత వెళ్లిన రోజులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా.. ఆమె తన అపార్ట్ మెంట్ ముందు ఆటోలో వెళ్లడం కనిపించింది. ఆ తరువాత ఆమె ఎక్కడికి వెళ్ళిందనే దానిపై స్పష్టత లేదు. రోహిత తన ఫోన్‌ను అపార్ట్‌మెంట్‌లోనే ఉంచడంతో, ఆమె ఆచూకీని ట్రేస్ చెయ్యడం పోలీసులకు సాధ్యం కావడం లేదు.