భూపాలపల్లిలో మెడికో దారుణ హత్య.. కాళ్లూ చేతులు కట్టేసి!

భూపాలపల్లిలో ఓ మెడికల్ విద్యార్థి  దారుణ హత్యకు గురయ్యాడు. కాలేజీకని బయలు దేరిన యువకుడు హత్యకు గురై, బావిలో శవంగా తేలాడు. వివరాల్లోకి వెళ్తే.. భూపాలపల్లి కనపర్తికి చెందిన ఓ విద్యార్థి.. ఖమ్మం మమత మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం కాలేజీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకువెళ్లాడు వంశీ. ఎంతకీ రాకపోవడంతో.. మృతుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేయగా.. ఓ బావిలో […]

భూపాలపల్లిలో మెడికో దారుణ హత్య.. కాళ్లూ చేతులు కట్టేసి!

Updated on: Jan 18, 2020 | 4:23 PM

భూపాలపల్లిలో ఓ మెడికల్ విద్యార్థి  దారుణ హత్యకు గురయ్యాడు. కాలేజీకని బయలు దేరిన యువకుడు హత్యకు గురై, బావిలో శవంగా తేలాడు. వివరాల్లోకి వెళ్తే.. భూపాలపల్లి కనపర్తికి చెందిన ఓ విద్యార్థి.. ఖమ్మం మమత మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం కాలేజీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకువెళ్లాడు వంశీ. ఎంతకీ రాకపోవడంతో.. మృతుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేయగా.. ఓ బావిలో శవమై తేలాడు.

కాళ్లూ, చేతులు కట్టేసి హత్య చేసిన అనంతరం వంశీని బావిలో పడేశారు గుర్తు తెలియని దుండగలు. రేగొండ మండలం కనపర్తిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా మృతుడు వంశీ ఎంబీబీఎస్ చదువుతున్నాడు. మృతదేహాన్ని బయటకు తీసి విచారణ చేస్తున్నారు పోలీసులు. అయితే.. వంశీ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమయి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us