కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం.. మంత్రాలు చేస్తున్నాడన్న నెపంతో వ్యక్తి హత్య..

మనుషుల్లో మానవత్వం రోజు రోజుకు తగ్గిపోతుంది అనడాకిని కొన్ని సంఘటనలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. మంత్రాలు చేస్తున్నాడన్న నెపంతో ఓ వ్యక్తిని కర్రలతో కొట్టి దారుణంగా హతమార్చారు.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో  విషాదం.. మంత్రాలు చేస్తున్నాడన్న నెపంతో వ్యక్తి హత్య..

Updated on: Feb 01, 2021 | 10:12 PM

మనుషుల్లో మానవత్వం రోజు రోజుకు తగ్గిపోతుంది అనడాకిని కొన్ని సంఘటనలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. మంత్రాలు చేస్తున్నాడన్న నెపంతో ఓ వ్యక్తిని కర్రలతో కొట్టి దారుణంగా హతమార్చారు. ఈ విషాద ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని సిర్పూర్‌(యు) మండలం ధనోరా(పి) గ్రామంలో  సెడ్మకి తుకారం(50)  ఎవరికైనా అనారోగ్య సమస్య వస్తే చెట్ల మందులు పోసేవాడు. అయితే తమపై మంత్రాలు చేస్తున్నాడన్న అనుమానంతో తుకారంపై అదే గ్రామానికి చెందిన సెడ్మకి నాందేవ్‌  ద్వేషం పెంచుకున్నాడు.

తన కొడుకు భీంరావుతో కలిసి తుకారాంను చంపాలని పథకం పన్నాడు. ప్లాన్ ప్రకారం సోమవారం తన భార్య ఆరోగ్యం బాగాలేదని, మందులు ఇవ్వాలని ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడే ఉన్న కొడుకుతో కలిసి నాందేవ్‌ కర్రలతో దాడి చేసి హత్య చేసాడు. ఈ దాడిలో తుకారాం తలకు తీవ్రగాయం అయ్యాయంది. దాంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు  సంఘటనా స్థలానికి చేరుకొని మృతుడి కొడుకు అంబాజీ ఫిర్యాదు మేరకు నాందేవ్‌, భీంరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

సాయం చేద్దామని లిఫ్ట్‌ ఇస్తే.. ద్రోహం చేసిన దుర్మార్గుడు.. అయ్యో పాపం అంటే పెట్రోల్ పోసి అంటించాడు..

Loading...
Unable to load recommendations.
Follow Us