సొంత కూతురిపై అత్యాచారాని పాల్పడ్డ మదర్సా టీచర్.. అంతేకాదు..

కేరళలో దారుణం వెలుగు చూసింది. కాసరగోడ్‌ జిల్లాలోని ఓ మదర్సాలో సొంత కూతురిపై కన్నేశాడు ఆ మదర్సాలో టీచర్‌గా పనిచేస్తున్న వ్యక్తి‌. ఆయన వయస్సు యాభై ఏళ్లు. ఆయనకు ఓ పదహారేళ్ల కూతురు ఉంది. అయితే సొంత..

సొంత కూతురిపై అత్యాచారాని పాల్పడ్డ మదర్సా టీచర్.. అంతేకాదు..

Updated on: Jul 21, 2020 | 5:51 PM

కేరళలో దారుణం వెలుగు చూసింది. కాసరగోడ్‌ జిల్లాలోని ఓ మదర్సాలో సొంత కూతురిపై కన్నేశాడు ఆ మదర్సాలో టీచర్‌గా పనిచేస్తున్న వ్యక్తి‌. ఆయన వయస్సు యాభై ఏళ్లు. ఆయనకు ఓ పదహారేళ్ల కూతురు ఉంది. అయితే సొంత కూతురిపై కామంతో కన్నేసిన ఆ ప్రబుద్ధుడ గత రెండేళ్లుగా అత్యాచారానికి ఒడిగడుతున్నాడు.  ఈ క్రమంలో బాధితురాలు ఇటీవల మూడు నెలల క్రితం గర్భం దాల్చింది. దీంతో నిందితుడు రెండు నెలల క్రితం బాలికకు అబార్షన్ చేయించాడు. అయితే నిత్యం తండ్రి చేస్తున్న చర్యలను గమనించిన బాలిక బంధువు ఒకరు జిల్లాలోని నీలేశ్వర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కాసరగడ్ జిల్లాలోని నీలేశ్వర్‌ పోలీసులు మదర్సా టీచర్‌గా పనిచేస్తున్న నిందితుడిని అరెస్ట్ చేశారు. అంతేకాదు.. బాధిత బాలికపై లైంగికంగా వేదింపులకు పాల్పడ్డ మరో ఆరుగురు యువకులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. లైంగిక వేదింపులకు పాల్పడ్డ ముగ్గురు నిందితుల్ని రియాస్ (19), ఇజాజ్ (20), మహ్మద్ అలీ (20) గా గుర్తించారు. కాగా, బాలికపై జరుగుతున్న అకృత్యాలు తల్లికి తెలుసా.? లేదా..? ఏందుకు మౌనంగా ఉందన్న విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుడిపై గతంలో కూడా పలువురు అబ్బాయిలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని.. విచారణలో తేలింది.

Loading...
Unable to load recommendations.
Follow Us