తమిళనాడులో కలకలం రేపుతున్న కేరళ యువతి గ్యాంగ్ రేప్.. సీఎం స్టాలిన్‌కి ఫిర్యాదు చేసిన ఆమె భర్త..

Crime News : తమిళనాడులో జరిగిన కేరళ యువతి గ్యాంగ్ రేప్ స్థానికంగా కలకలం రేపుతోంది. పళణి ఆలయ దర్శనానికి వచ్చిన కేరళ

తమిళనాడులో కలకలం రేపుతున్న కేరళ యువతి గ్యాంగ్ రేప్.. సీఎం స్టాలిన్‌కి ఫిర్యాదు చేసిన ఆమె భర్త..
Woman gang-rape

Edited By: uppula Raju

Updated on: Jul 13, 2021 | 8:27 AM

Crime News : తమిళనాడులో జరిగిన కేరళ యువతి గ్యాంగ్ రేప్ స్థానికంగా కలకలం రేపుతోంది. పళణి ఆలయ దర్శనానికి వచ్చిన కేరళ యువ జంటపై కొంతమంది దాడి చేశారు. రూమ్ లో ఉన్న భర్తను కొట్టి యువతీ పై పలుమార్లు గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆమె భర్త వాపోతున్నాడు. ఇరవై రోజులుగా న్యాయం కోసం పోరాడుతున్నాడు. ఎవరూ సహకరించకపోవడంతో సీఎం స్టాలిన్‌ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని తెలియజేశాడు. స్పందించిన సీఎం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు అతడి కేసును పట్టించుకోని పోలీసులపై విచారణకు ఆదేశించారు.

ఎన్ని చట్టాలు తెచ్చినా ఎన్ని శిక్షలు వేసినా మహిళలు, యువతులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. మృగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. మానవత్వం మరిచి అత్యంత నీచమైన పనులు చేస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు. ఆలయ దర్శనం కోసం వచ్చిన జంటపై ఇలా చేయడం అమానుషమని తమిళనాడు మహిళ సంఘాలు ఆగ్రహిస్తున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసు ఇప్పుడు సీఎం స్టాలిన్ పరిధిలోకి వెళ్లడంతో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Free Condoms: ఐదో తరగతి విద్యార్థులకు కండోమ్స్‌ తప్పనిసరి.. సంచలన నిర్ణయం తీసుకున్న పబ్లిక్​ స్కూల్స్ ఎడ్యుకేషన్. ఎక్కడో తెలుసా?

Koushik Reddy: ‘ఒకే ఫోన్‌ కాల్‌’.. హుజురాబాద్‌తో పాటు తెలంగాణ రాజకీయాలను ఒక్క కుదుపు కుదిపింది

MAA Elections Vishnu: ఏకగ్రీవం చేస్తే పోటీ నుంచి తప్పుకుంటా.. మా ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మంచు విష్ణు.

Gupta Nidhulu: నిర్మల్‌ జిల్లాలో గుప్తనిధుల కలకలం.. కన్నం వేసేందుకు కన్నింగ్‌ ఫెల్లో ప్లాన్.. ఏమైందో తెలుసా..